పుట:Shathaka-Kavula-Charitramu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(xi)


గలశతకములు లేకపోలేదు. ప్రసన్నరాఘవశతకము వంగూరినర్సకవిప్రణీతము. రెండునూర్లపద్యము లున్నవి. శతకమువలె మకుట మున్నది. రామాయణకథ యితివృత్తము. ఉదాహరణమున కొక పద్యము చూపెదను,

"తల్లడ మందదేవతలు దానవులు౯ రఘురాముఁ డప్పుడు౯
 విల్లవలీలఁగాఁ దునిమె వేడుక మెచ్చ నృపాలుఁ డాత్మలో
 నల్లుఁడు రామభద్రుఁ డన నాదిమ రేశ్వరుఁ డంచు సీతయు౯
 బల్లవపాణి యాత్మఁ దనభాగ్యము మెచ్చెఁ బ్రసన్న రాఘవా||"
                                                 ప్రసన్న రాఘవశతకము, 53 పద్యము

(2) ఇట్టిదే రంగేశకృష్ణశతకము రెండవది. ముడుంబై వేంకటరామ నృసింహాచార్యకృతము. ఇందు రుక్మిణీకళ్యాణాది భాగవత కథ లున్నవి.

(3) "ఇందూనందునిమందనుండికద నీవేతెంచుటల్' రాక౯" అనుమకుటముతో పుసులూరి సోమకని “చంద్రదూత” యను మనోహరకావ్యము కృష్ణవిరహముచే నొకగోపిక యడిగినట్లు ' తానే గోపికనని వణి౯ంచియున్నాఁడు ఇది మిక్కిలి మనోహర మైనది.

ఇఁక ననేకము లిట్టికథలు వణిన్ంచుశతకము లున్నవి. కాని శతకమునం దితివృత్తముండక పోవుటయేతఱుచుగాఁ గానవచ్చుచున్నది.

సంస్కృతమున భావగీతములు శృంగారరసోద్దీపకములు. తెలుఁగున భక్తిభరితములు. కొందఱు భక్తిశృంగారము లొక్కటియే యని నిరూపించెదరు.

సంస్కృతమునందు ఋతుసంహారము, ఘటకర్పరము, చోర పంచాశత్తు ననున వన్నియు శతకస్వభావము కలవే.

ఈచౌరపంచశతకమునే చళ్ల పిళ్ల నరసకవి యామినీపూర్ణతిలకావిలాస మనియు, చెన్నూరి శోభనాద్రికవి శృంగారసుథాసముద్ర పూర్ణచంద్రోదయ మనియు వ్రాసిరి.