పుట:Shathaka-Kavula-Charitramu.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(x)

తెలుఁగువాఙ్మయము చాలవఱకు సంస్కృతానుసరణమే. మనపురాణములు కేవలభాషాంతరీకరణములు కాకపోయినను, సంగ్రహములుగా ననుసరణములు. మూలముకంటె భాగవతమునం దభివృద్దికూడ నున్నది. అయినను స్వరూపస్వభావము లనుసరణములే యనవచ్చును. ప్రబంధములుకూడఁ గేపలభాషాంతరీకరణములు కాకపోయినను సంస్కృతలక్షణానుసారము వ్రాసినవి. కథ, పాత్రలు, రీతి, . యివి యన్నియు సంస్కృతము నందలివే! స్వకల్పనము మిక్కిలితక్కువ. కాని శతకము లట్లు కాదు. శతకస్వరూపము, పద్యసంఖ్య, దశకవిభాగము, మొదలగునవి ప్రాకృతజనితము లయ్యు, శతకములలో సంస్కృతభాషాంతరీకరణములు మిక్కిలితక్కువ. ఈపరిమితి యెంతవఱకో, సంస్కృతశతకముల స్వరూప, స్వభావ, ప్రచారములెట్టివో కనుగొందము. అనఁగా “చాటుప్రబంధములు”గా సంస్కృతమున నీఖండకావ్యము లెన్ని, యెట్లు, యెప్పుడు పుట్టినవి, యెట్లభివృద్ధి నొందినని, అవి 'తెలుఁగు వాఙ్మయమున నేమిమార్పు లొనరించినవి, మొదలగు విషయములఁ చూచాయఁగఁ గనుఁగొనఁ బ్రయత్నించెదముగాక !

భావగీతములు - వానిలక్షణము.

భక్తియే శతకములు మొదలగుచాటుప్రబంధములరచనకుఁ మూలకారణ మని తెలిసికొనియుంటిమి, భావగీతము లని మనవా రిప్పు డనుచున్నలిరిక్కులు (Lyrics.) . శృంగార, భక్తిభరితములు. వేఱొకచోటఁ గాళిదాసునిమేఘదూత శతకస్వభావము కల దని చెప్పియుంటిని. అది భావగీత మనియే నాయభిప్రాయము, సంస్కృత భావగీతములలో నెల్ల మిన్నయై మనదేశమునందేగాక జర్మనీదేశమునందలి "గెటి” వంటిపండితుని మెప్పునొందిన దీమేఘదూతయే! దీనియందుఁ గొంచెముకథ, కావ్యలక్షణములు, నున్నవి. ఎడతెగకుండ గథ పద్యములపైఁ బ్రాకును. ఇది శతకములలో సాధారణముగా నుండదు. ఏపద్యమున కాపద్యమే యొకసంపూర్ణస్తుతి. ఆభావమంతతో ముగియును. అయినను దెలుఁగులోఁగూడ మేఘదూత వంటికథ