పుట:Shathaka-Kavula-Charitramu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(xii)

సంస్కృతమునందు శతకత్రయ మని వాడుకలో నున్నభర్తృహరిసుభాషితరత్నావళి ప్రసిద్ధ మైనది.

సంస్కృతమునందలిశృంగారశతకము, శృంగారతిలకమునుగూడ మనోహర కావ్యము లనుటకు సందియము లేదు. ఇట్టి మంచిశతకములు తెలుఁగులో నెక్కువ లేపు. భావకావ్యములలో నమరుశతకము సుప్రసిద్ధమైనది. దీనిగుణము వ్రాఁత కలవికానిది. ఇందుఁ గాముకీ కాముకులు వేర్వేరవస్థలయం దెట్టియెట్టిపాట్లు పడుదురో ప్రకృతి ననుసరించి కవి చిత్రంపఁగలిగెను. ప్రణయకోపము, వియోగము, పునః సమాగమమును, అమరుశతకమున మనోహరముగఁ జూపెను. దంపతులుసమాగమసుఖము, ఆనందము, వియోగము, నిరుత్సాహము, భక్తి, ప్రేమము. వీనిదశ లన్నియు నతిచిత్రముగ స్ఫురింపఁజేయును. అన్నిఁటికంటెఁ జిత్ర మేమనగా నందఱు నెఱిఁగినవిషయమునే క్రొత్త రూపమునఁ గవి చెప్పును. అది మన మెఱిఁగినవిషయమైనను నందు నవ్యత ప్రదర్శన మొంది క్రొత్తభావములఁ బుట్టించి యానంచ మొదవించును. ఇది కవితాధర్మములో నుత్కృష్టమైనది. విచిత్రమైన సృష్టినైపుణ్య మని చెప్పవచ్చును. ఇందు వర్ణించినప్రేమ మాదర్శ ప్రాయమైనది కాక మోహమై కనఁబడుచున్నది. మనవాఙ్మయము నందుఁ బవిత్రప్రేమము లేదనియు, పూర్తిగా మోహపూరిత మనియుఁ గొందఱందురు. ఇది సత్యముకాదు.మనవాఙ్మయమునందుమనమిప్పుడు రసమునుగూర్చి మాటలాడుచున్నాము. ఏరస మెట్లున్నదని మనప్రశ్నము. అంతేకాని యది నీతిమంతమా కాదా యని కాదు. కావ్యగుణపరీక్షయందుధర్మశాస్త్ర ప్రయోజనము స్వల్పము. అమరుశతకము నందలి శృంగారము నిషిద్ధమైనది కాదు. - సత్యమైనమాట భావపూరిత మైనశతకములు, ఖండకావ్యములే గాక తారావళులు, ఉదాహారణములు, తుదకు చాటుపద్యములు, ఒక వాక్యముకూడఁ గావ్యమే యనవలెను, ఉద్రిక్తహృదయముతోఁ గవి వ్రాసినది భావగీతము. అనఁగా శిల్పి నేర్పుతో మనయందు రసో