పుట:Shathaka-Kavula-Charitramu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6


శ్లో. కావ్యంయశనే ౽ర్థకృతే వ్యవహారవిదే శివేతరక్షతయే,
    సద్యః పరనిర్వృతయే కాంతాసమ్మిత తయోపదేశయుజే.

కావ్యప్రయోజనము రసౌచిత్యమూలమున స్థాయీభావమునుగలుగ జేయుటయైనను నయ్యది పురుషార్థసిద్ధికి సాధనము గావలయును. పద్యభేదమును సంఖ్యనుబట్టి కావ్యస్వరూపమును నిర్ణయించుట ప్రయోజనకరముగాదు. భావానుసంధానము లేనిషద్యముల సముదాయము కావ్యముగ బరిగణింపబడదు. భావానుసంధానముగల మేఘదూతము చిన్నదైనను కావ్యముగ బరిగణింపబడుచున్నది. రసౌ చిత్యముగల భావగీతములును గావ్యవిభాగములుగ బరిగణింపబడుచున్నవి.

సుబ్బారావుగారు శతకములు భావగీతములను బోలి యావాఙ్మయశాఖకు జెందినవని నిర్ణయించిరి. ఆంగ్ల వాఙ్మయరీతులలక్ష్యముతో శతకవాఙ్మయరీతిని బరిశీలించినపు డీనిర్ణయము యుక్తముగ దోచినను నీపోలికయును నిర్ణయమును నసంగతములు. భావగీతములకును శతకములకును బోలికయుండదు. భావగీతములందు గవి ప్రకృతిస్వరూషముల గుణసౌందర్యములనుగాని మనోభావములనుగాని మనోహరముగను వర్ణించుచు భావవికాసమును గలుగజేయును. భావగీతములుగలుగజేయు భావవికాసము మానసికానందమును గలుగజేసినను నాత్మానందమును గలుగజేసి పురుషార్థమునకు బ్రయోజనకరముగాదు. శతకములు భావగీతముల కతీతమైన యాత్మానందమును గలుగజేయుచు పురుషార్థమును బడయుటకు సాధనములుగ నున్నవి. శతకములు సామాన్యముగను భక్తిశతకములుగ నున్నవి. పురుషార్థమునకు బరమావధియైన మోక్షప్రాప్తి శతకమునకు బ్రయోజనము. కవులుధనకనకవస్తువాహనములనర్థించుచు ప్రబంధాదులను వ్రాసినను మోక్షకాములై శతకములను వ్రాయుచుండిరి. కవులు చిన్నతనమునందు శతకములను బెద్దతనమునందు