పుట:Shathaka-Kavula-Charitramu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

9

గ్రంథము నాలుభాగములు గలిగి 200 శతకకవుల చరిత్రనుగలిగి యున్నది. ప్రథమభాగమునందు 1150-1500, ద్వితీయ భాగమునందు 1500-1700, తృతీభాగమునందు 1700-1800, చతుర్థభాగమునందు 1800-1900 వరకును జీవించిన శతకకవుల చరిత్రములుగలవు. శతకకవులజీవితములందలి సుబ్బారావుగారి నూతనాన్వేషణములు వారిపరిశోధనసామర్థ్యమును విశదము చేయుచున్నను గ్రంథబాహుళ్య మనవసరముగ గలిగినది. సుబ్బారావుగారి గ్రంథరచనాసక్తివలన బునరుక్తి దోషమును నిర్నిమిత్తమైన బాహుళ్యమును గలుగుచున్నవి.

శతకకవులచరిత్రమును ఆంధ్రవాఙ్మయచరిత్రమువలె నాంధ్రవాఙ్మయమునకు సుబ్బారాపుగారు సమర్పించిన నూతనాలంకారము. గ్రంథము సుబ్బారావుగారి రచనాసామర్థ్యమును బరిశీలనకౌశలమును విశదముచేయుచు నవవిధానమును సూచించుచున్నది. అయిదారువందల శతకములను నితరగ్రంథములను బరిశీలించి విషయమును సమన్వయముచేసి వ్రాయుటయందు గల పరిశ్రమను బండితులు గ్రహింవ నోపుదురు. నూతనరచనలయందును గల్పనలందును లోపములు సహజముగ గనుపడుచుండును. భావికాలమునందు శతకకావ్యాభిమానులీ లోపములను సవరింపనోపుదురు. ఆంధ్రవిద్యావంతులకు జరపరిచితమైన సుబ్బారావుగారి శైలి, రచనాసామర్థ్యము, నితరగుణములును జర్చించి వర్ణించుట యనవసరము. ఆంధ్రవాఙ్మయసేవకై జీవితమును సమర్పించిన శ్రీయుత వంగూరి సుబ్బారావుగారి కృతికి చిరంజీవిత్వమును వారి యాత్మ కానందమును విశ్వకళ్యాణమూర్తి విశ్వేశ్వరు డనుగ్రహించుగాత!

కా. నాగేశ్వరరావు.