పుట:Shathaka-Kavula-Charitramu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5

శతకవాఙ్మయ మాంధ్రభాషయందపారముగ నున్నది. సుబ్బారావుగారు 600 శతకములను జూచినటులు వాసియున్నారు. ఇంకను బరిశోధన చేయవలసిన శతకము లనేకములు గలవు. ప్రస్తుతముకనుషడుచున్న శతకములందు పాల్కుర్కి సోమనాథవిరచితమైన వృషాధిపశతకము ప్రాచీనశతకము. ఇది పండ్రెండవశతాబ్దికి జెందినది. అప్పటినుండి నేటివరకును శతకరచన లవిచ్చినముగ గనుపడుచున్నవి. ఆంధ్రభారతకాలమునుండియు నవిచ్చిన్న జీవితముగల శతక వాఙ్మయ మాంధ్రవాఙ్మయపరిశోధకులకును భాషాభిమానులకును నాదరణీయముగ నున్నవి. ఆంధ్రవాఙ్మయమునందు శతకవాఙ్మయస్థానమును ప్రయోజనమును నిర్ణయించుటయె శతకకవుల చరిత్రమునకు బ్రయోజనము. కావ్యప్రయోజనము నిర్ణయించుటయందు పండిత ప్రయోజనములను గ్రంథబాహుళ్యమును రసాత్మకమునుబట్టి నిర్ణయించుట యాచారమైనను కేవలము రసపోషణమూలముననే యాదరణమును బడసిన కావ్యములు గలవు. మేఘసందేశము చిన్నదైనను కావ్యముగ బరిగణింపబడుచున్నది. “రసాత్మకమైనవాక్యము" కావ్యమనియును, “రమణీయార్థప్రతిపాదకమైనశబ్దము” కావ్యమనియును,

"శ్లో. నిర్దోషలక్షణవతీ సరీతి ర్గుణభూషితా,
     సాలంకార రసానేక వృత్తి ర్వా క్కావ్యనామభాక్."

కావ్యమనియును, లాక్షణికులు వ్రాసియున్నారు. ఆంధ్రలాక్షణికగ్రంథకర్తలు శతకములను జాటుప్రబంధములందు జేర్చిరి. విన్నకోటపెద్దన్నగారు శతకములను క్షుద్ర కావ్యములందు జేర్చిరి. శతకముల కావ్యవిభాగమును నిర్ణయించుటకు గావ్యప్రయోజనమును నిర్ణ యిచుట సమంజసము, మమ్మటాచార్యుడు నిర్ణయించిన కావ్యప్రయోజన మాదరణమును బడసినది:-