పుట:Shathaka-Kavula-Charitramu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3

సుబ్బారావుగారి మేధాశక్తులందు సంభావనాశక్తి విశేషము. పరిశోధనలం దొకవిశేషము గనుపడినపుడు పరమోత్సాహభరితులై కావ్యసిద్ధాంతనిర్మాణముల కుపక్రమించుచుండిరి. ఈయూహాశక్తియే సుబ్బారావుగారి వ్యక్తిత్వమును స్థాపించి ఖండనమండనములకును దూషణభూషణములకును గారణంబైనది. ఆంధ్రక్షత్రియులు, వేమన, ఆంధ్రవాఙ్మయచరిత్రము, శతకకవులచరిత్రము, వసంతలేఖలు మొదలగు గ్రంథములు సుబ్బారావుగారి యూహాశక్తిని విశదముచేయుచున్నవి. వీరు సామాన్యవిషయాధారమున మహానిర్మాణములనుజేసి పండితుల ఖండనమండనములకు బాలగుచుండిరి. ఆంధ్రవాఙ్మయచరిత్ర పీఠిక యందు శ్రీయుత కట్టమంచి రామలింగారెడ్డిగారు వ్రాసినభావము లీ విషయమును స్పష్టముచేయుచున్నవి.

“వాఙ్మయ చరిత్ర సంఘశాస్త్రసంబంధిగా వ్రాయఁబడియుండుట శ్లాఘనీయమైన విశేషము. అనేకస్థలముల సుబ్బారావుగారు నూతన యోజనముల ప్రయోగించి క్లిష్టార్థములకు నన్వయమునద్భుత భంగి కల్పించియున్నారు. ఇవి మొత్తముమీఁద వెఱ్ఱియూహలకుఁ జేరినవిగాక విమర్శనాపద్ధతి ననుసరించిన దృఢసత్త్వములుగా నున్నవి.” రామలింగారెడ్డిగారు వాఙ్మయచరిత్ర పీఠికయందు వ్రాసిన భావములు శతకకవులచరిత్రమునకును నన్వయించుచున్నవిధము శతకకవులచరిత్ర పఠనము విశదము చేయుచున్నది.

బ్రహ్మశ్రీవేదము వేంకటరాయశాస్త్రిగా రీగ్రంథమునకు బీఠికనువ్రాయుట కనుగ్రహించిరి; కాని, కారణాంతరములవలన నాపని సంభవముగాలేదు. గ్రంథము ముద్రితమై పదిమాసములైనను బీఠికకై ప్రచురణము నిలిచినది. సుబ్బారావుగారు ముద్రితమైన కాగితములను నాతావున కంపి పీఠికను వ్రాసి ప్రచురింపుమని కోరుచుండిరి. కాని, నేనట్టి