పుట:Shathaka-Kavula-Charitramu.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాలుకురికి సోమనాథుఁడు.

31

క. వంటని దుర్వ్యసనంబుల, పెంటకుఁ గా కీశుభక్త వెరవునకుంగా
   కుఁటఁ జెడు భక్తివాసన, రెంటికి నెడతాకి చెడ్డ రేవనిభంగి౯ .

ఈసామెతనే తరువాతవా రనుకరించినట్లు తోఁచుచున్నది.

సుమతిశతకమున కనుకరణమో, లేదా యీతనినే సుమతి శతకకర్త యనుకరించెనో చెప్పలేము కాని యట్టిభాగము లీతని గ్రంథముల నున్నవి.

“కలనాఁడె ధనము ప్రాయము, గలనాఁడె జవంబుబలము కలవాఁ డెవిని
 శ్చలమతియు గతియుఁ దనకు౯, గలనాఁడె భజింపవలయుఁ గరుణానిలయు౯”
                                                                          అనుభవసారము.

ఈపద్యము ననేకాంధ్రకవు లనుకరించుచువచ్చిరి. సోమనాధుని గ్రంథము లన్నియునుఁ జదివిన నిట్టివై చిత్ర్యము లెన్ని యో తెలియఁ గలవు.

ఈక్రిందిపద్యమును వేమన్న యనుకరించె ననవచ్చును.

క. అడుగమి నిచ్చుట యుత్తమ! మడిగినయెడ నీఁగిణయెన్న నగు మధ్యమ మ
   ట్లడిగిన మెయ్యొ (య్య?)రపుల దా|నిడుటయె యధమంబు భక్తియెడఁద్రిపురారీ.
                                                                        అనుభవ సారము.

ఆ. అడుగ కర్థ మిచ్చునతఁడు బ్రహ్మజ్ఞాని| అడుగ నర్థ మిచ్చునతఁడు త్యాగి
    అడుగ నియ్యలేనియాతఁడె పెనులోభి | విశ్వదాభిరామ వినుర వేమ!!
                                                                     వేమన పద్యములు

తిక్కనకంటెఁ బూర్వుఁ డైనసోమనాథునియనుభవసారము నందు షష్ఠ్యంతము లున్నవి. కావునఁ గవులచరిత్రము తిక్కనయే మొదట షష్ఠ్యంతములు వ్రాసె నని స్థాపించి, యాస్థాపనమునకు సరిపడనిచాముండికావిలాసాదులషష్ఠ్యంతముల నెపమునఁ గల్పితగ్రంథము లనినమాటలు నిలుచుట లేదు నేను చూచినకొలఁది నీకవిగ్రంథము లెన్నియో విశేషములతో నున్నట్లు కనుగొంటిని. పరిశోధకు లిఁకనైన నీతని యితరగ్రంథములు శ్రద్ధతోఁ బఠింపవలసియున్నది. ఈతనిపండి