పుట:Shathaka-Kavula-Charitramu.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

శతకకవులచరిత్రము


జయించి, శిష్యులకు డొంకిప ఱ్ఱగ్రహార మిప్పించి తాను కన్నడమునకు సోమన పోయె నని బసవపురాణమునందే యున్నది. ఈతఁడు గంగ గోదావరి చెంగట నున్న పాల్కురికిలో సమాధి రచించుకొని సిద్ది నొందెను. ఇతఁడు యతి (1. 79.) నవ్య వ్యాసుఁడు (1. 186.) ఇతఁడు తన గ్రంథమున 'ఆతత బసవపురాతన భక్తగీతార్థసమితియె మాతృక గాఁగ' బసవపురాణము వ్రాసితి నని కృత్యాదినిఁ జెప్పుకొనెను.

పాలుకురికి సోమనాథునిగ్రంథములలో నత్యద్భుత మైనవిషయము లున్నవి. మతవిషయము లక్కఱలేనివారికి దేశ, భాషా, వాఙ్మయ, సాంఘిక, రాజకీయ విషయము లెన్నియో తెలిసికొన వీలగుచున్నది. కాని యీతనికావ్యము లింతవఱ కంతగాఁ జదివిన పరిశోధకులు కనఁబడరు. బసవపురాణకృతిపతి యగు గొబ్బూరి సంగనామాత్యునిగూర్చికాని, అనుభవసారకృతిపతి యగు గోసగి నారయాఖ్యు (త్రిపురారి)ని గూర్చికాని మనకు వివరములు తెలిపినవారు లేరు. పాలుకురికి సోమనాథునిగురువు విశ్వేశుఁ డని సోమన్న యే వ్రాసిన యీక్రిందిపద్యభాగములవలనఁ గూడ దెలియఁ గలదు.

ఈవిశ్వేశుఁడే బెలిదేవి వేమనారాధ్యుల మనుమఁ డై యుండును.

“కుశలు౯ విశ్వేశు విమలగురుహరు శరణు౯”. 1
                                            అనుభవసారము.

“విమలచిత్ప్రపూర్తి విశ్వేశువరమూర్తి , వినయవర్తి భువనద
విభు కరస్థలంబు విశ్వేశుకారుణ్య, జనిత వినుత కావ్య శక్తి యుతుఁడు"
"చరలింగ ఘనకరస్థలి విశ్వనాథ ” 2
                                          అనుభవసారము.

"వరకృపాంచిత కవిత్వ స్ఫూర్తిఁబేర్చి”
                                బసవపురాణము గద్య. 3

ఈనడుమ ననేకవివాదములకుఁగారణ మైన "రేవఁడు” శబ్ద మీవిధముగ ననుభవసారమునం దున్నది.