పుట:Shathaka-Kavula-Charitramu.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

శతకకవులచరిత్రము


తారాధ్యచరిత్రకృత్యాదిని "ప్రాసోవాయతిర్వా" యనుటవలన నితని నాఁటికే తెలుగుఁఛందోగ్రంథము లున్నట్లు తెలియఁగలదు.

ఈతని కించుమించుగా సమకాలికుఁ డని తలంచుచున్న నన్నెచోడుఁడేకాక బద్దెన్న కూడ నీతని పద్యముల వంటివి వ్రాసెను. నన్నెచోడ బద్దెన్నలకాల మింకను సంశ యాస్పదము లగుట నెవ్వరెవ్వరి నను కరించిరో తెలియదు.

క. "బలిమికిఁబాడి, తపంబున | కలుగమి, సిరికోర్పు, విద్యకభిమానము, వా
    గ్బలమునకు బొంకువొరయమి, కులమునకాచారమొప్పుఁగొమరురభీమా!! లోకనీతి. 5

క. హీనునకుబలిమి, పరా ధీనునకుసుఖంబు, దుర్మతికిరిపుజయ, మ
   జ్ఞానికిఁబరమును, నలిగెడు వానికి సైరణ,యసంభవము బద్దినృపా" లోకనీతి. 6
                                                                        బద్దినీతులు

వీనినిఁ బోలియున్న సోమనాథుని పద్యములు.

క. "నురువడికిఁదెలివి; భక్తికిఁ| బరిచర్య, గృతార్థమతికిభయమును ; ప్రతత
    త్పరతక చలనమును; దగస| చ్చరితకు నిస్ప్రుహయు; నొప్పుసద్భక్తినిధీ!! 48

క. వలవునకుఁదలఁపు; పేతకు| నలయమి; పలుకులకువినయ; మారాధనక
   గ్గలమగుసన్మానము; మతి| కలిమికి వినికియును; నొప్పుకరుణాంబునిధీ!! 49
                                                                       అనుభవసారము,

ఇట్లేనన్నెచోడుని కుమారసంభనమునం దొరయూరిపురవర్ణనమునందలి “కల్కోఁడికూఁతలు, కల్పొన్నవిరులు" మున్నగుసమానాంశము లున్నవి.

"ఈతఁ డారాధ్యచరిత్రము, బసవపురాణము, అన్యవాదకోలాహలము, బసవనపంచగద్య, సద్గురురగడ, చెన్నబసవరగడ, శరణు బసవరగడ, వీనిని కల్పించి సకలవేదాగమపురాణ వాక్యముల నుంచి యిరువదియైదు ప్రకరణములుగ సోమనాథభాష్యమునందు సంగ్రహించి ప్రకటించెను.” అని భైరవేశ్వరకావ్యముకథాసూత్రరత్నాకరము నందున్నది.