పుట:Shabda-Lakshana-Sangrahamu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12


ఖండము మంచి కప్పురము గైకొని హారతులిచ్చే దుర్వి ద
గ్ధుండు గులాభిమానియగు దోషికి బుద్ధిచలించె దుర్విలా
వుండగుటంత నోరుపడిపోయేను దుష్కృత మప్పుడప్పుడే
పండెను గర్మబద్ధుఁడయి పాపపరీవృత ఘోరపంకమ
గ్నుండయికుందె నీచుఁ దివఁ గోలెముకం గొఱుకంగ నక్కయా
దండకువచ్చి రోఁతఁగనదా ! పరవస్తు కులాబ్ధిచంద్ర ! నీ
పుండుదువోయి తెల్గులనొకొండు వసించినదాఁక నుర్వర౯.

    అనవద్య శేముషీ ఘనుఁడ వీవనుటకుఁ
                 గృతకృత్యుఁడౌ హయగ్రీవశాస్త్రి
    సాహిత్య సౌహిత్య సరణిలో నెనలేమి
                 న్యాయాధిపతి రంగనాథశాస్త్రి
    వాదోపవాద విద్వద్గోష్ఠి సరిరామి
                 వీర వేంకటగిరి విభువరుండు
    సువిశేష చారిత్ర శోభివీవనుటకు
                 యాయజూకాన్వవాయజుఁడవగుట

    సంస్కృత ప్రాకృతాంధ్రాంగ్ల శబ్దసార్వ
    భౌముఁ డన హూణవిభుదత్త భర్మకంక
    ణమ్మునంగల సూరి పదమ్ము మాకు
    సాక్ష్యమగుఁగాదె వీరవైష్ణవ కుమార !