పుట:Shabda-Lakshana-Sangrahamu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

11


ఇరువదినాల్గు గ్రంథము లహీనతరంబుగ వ్రాసి యంధ్రసుం
దరికి నమూల్యరత్నమయధామము లూర్జిత శక్తిఁగూర్చు నీ
యొరవడిలో మహాంధ్ర యునయూథము నిల్పితి వీయునజ్ఞకై
కరములు మోడ్చెరా ! తెలుఁగు ఖండ మఖండకవిత్వదీక్షకై.

పాణిని సూత్రఫక్కి కపవాదము గల్గినఁగల్గుఁగాక నీ
పోణిమి యందుఁ దప్పుఁగనఁబోము కుదించి రచించుపట్ల గీ
ర్వాణము మేలుగూర్చునని వాదమొనర్చెడి వారికింత వి
జ్ఞానముఁగూర్చి తాంధ్రకవిసంఘము మేలని మెచ్చఁ జిన్నయా!

గండరగండడుం గవినికాయ సమర్చితుఁ డాంధ్ర వాఙ్మయో
ద్దండుఁడు శాస్త్రవాద పరిధావన శాబ్దికతత్త్వ సార్వభౌ
ముండు కళాప్రపూర్ణుఁడు సముజ్జ్వలభావుడు జూతిభేద శూ
న్యుండగు నజ్ఘలాన్వయుఁడహో! నిలఁబెట్టి భవద్యశమ్ము; వా
క్శౌండుఁడు పూరుషాకృతిని గన్న సరస్వతి యాంధ్రభారతీ
భాండ విశారదుండు పరవాద భయంకరుఁ డాత్మతత్త్వ వే
ద్యుండు దయార్ద్రచిత్తుఁడు యధోచిత వాక్పరితోషితాచ్చభా
వుండు మహేశనామ జపపూత విశుద్ధచరిత్రుఁ డార్య ధ
ర్ముండు నటనశాబ్దికనభోమణి వాగనుశాసనుండు వాః
కాండ విదారితారిజనకల్పితవాదుఁడు మద్దురుండు స
న్మండల మండితుండు గుణమాన్యుఁడు దువ్వురివంశసింధు చం
ద్రుండు ఋతేరితమ్ముల బుధుల్దలలూఁపి సెబాసనంగ వా
క్చండిమతో సడంచెఁ గవి కలురియల్లరి నంత నాంధ్ర భూ