| |
దనకులస్వామి నుద్ధతరాజగజరాజ
మృగరాజవరు జగమెచ్చుగణ్డ
భూపాలు సబ్బాంబికాపుత్రు దన్నడ
కేతవల్లభు జగద్గీతకీర్త్తిం
బ్రీతి(౦) గొలిచి తనసునీతివాచాలతం
గొం(గ) ఖడ్గములం బ్రగల్భతరని
యోగయో(గు)౦డై సమున్నతసంపదలు
దాల్చి నెగడె బుధులు దన్నుం బొగడ.
| 1
|
| మ. వృ. |
అనిశంబు(న్) దనబుద్ధిపేర్మ్మిం బలిం దంత్రావాప్తిం ...౦(ట్టి)౦చ్చుచుం
దసవిక్రాంత్తి నరాతివర్గ్గము (భు)జాదర్ప్పంబు భంజించ్చుచుం
దనదాక్షిణ్యవిశేషతను బుధుల మిత్రశ్రేణి రక్షించ్చుచుం
ద్దనరెం గేతధరాతలేశు శచివోత్తంసుండు వ్రోలం డిలను.
| 2
|
44
ఇది చెన్నపురము సమీపమున పల్లవరము దగ్గఱ నున్న ప్రాఁతపల్లవరములో నొకనూతియొద్ద నొకఱాతిమీఁద చెక్కఁబడియున్నది. (A. R. 55 of 1909.)
| సీ. |
కసిమియ్యసాహేబు ఖన[1]కీర్త్తి రంజిల్ల
షేకుహస్సానకు[2] చెల్వ మమర
పల్లావరంబ్బున ప్రఖ్యాత మైనట్టి
పేట గావించెను పేర్మ్మితోడ
|
|
- ↑ "ఘన" అని యుండనోపు.
- ↑ "హస్సానుకు" అని యుండనోపు.