| |
గను ప్రెమోదూత[1]హయనవైశాఖ[2]
శుద్ధ తృతీయార్కశుభదినమున
ముగశీర్ష[3]నక్షత్ర మేషలగ్నమునందు
శ్రీకూర్మనాయక శ్రీపదములు
సంత్తతంబును బూజ జరిగించు మనుచు చా
మర సీతారామమహిసురునకు
ముత్యగోత్రభవుడు మంధల తంమంన్న [4]
సుందరపువృర్త్తి[5] సూర్యసోము
లెంత్తగాల ముందు రంత్తపర్య(౦)తము
నాత్మ పుణ్యకీర్తు లలర నొసగె.
|
|
43
ఇది గుంటూరుమండలము సత్తెనపల్లితాలూకా వేలువూరుగ్రామములో రామలింగేశ్వరస్వామి యాలయముదగ్గఱఁ బడియున్న యొకచితికిపోయినఱాతిమీఁద చెక్కఁబడియున్నది. (A. R. 588 of 1925.)
| సీ. |
...౦చ్చిప్రభ నొప్పి పెగ్గ......
నిర్మ్మలభూరికీర్త్తి... ... ...
యాత్రయ ... పవిత్రుండు వ్రేకేటి
పురవల్లభుండు గుణాకరుండు ఘనుండు
|
|
- ↑ "ప్రమోదూత" అని యుండవలెను.
- ↑ గణభంగ మయినది.
- ↑ "మృగశీర్ష" అని యుండవలయును.
- ↑ గోత్రముపేరు మత్య లేక మత్స్య అని గాని పురుషునిపేరు ముందల తమ్మన్న అని గాని యుండవలెను. పైశాసనములో "మాతృగోత్రోద్భవ మండ్డలతంమ్మన్న" అనియున్నది.
- ↑ "వృత్తి" అని యుండవలెను.