| |
జగదేకవిఖ్యాతి జనపతు లెన్నంగా[1]
సంత సాగించెను శాశ్వతముగ
సకలజనాధరసరణియై దనరంగ్గ
భావిలు కల్పించెను[2] ప్రౌఢి మెరయ
సైదిభురాహేము సాహెబుపేరిట
విభురాముభాగని వెలయజేశె
గంఠాపథంబ్బున గంభీర మైనట్టి
చావళ్లు గట్టించ్చె (సాస్వ)తముగ
అనుచు వజ్రీలు (మ)న్నీ లు అభినుతింప్ప
వెలసితివి ధరలోన వినుతికెక్కి
శెఖు అలావబ్దిను[3] గర్భాబ్ది(స్రే)కరమున[4]
శేకు ముసామియ్య నృపాలశేఖరముంగా[5].
| 1
|
45
ఇది గుంటూరుజిల్లా గుంటూరుతాలూకా మందడముగ్రామములో మల్లికార్జునస్వామియాలయములోని అమ్మవారిగర్భగృహము గోడమీఁద నున్నది. (A R. 104 of
1017).
| ఉ. |
(మొదటఁ గొంతభాగము పోయినది)
సూరమాంబికకు మిక్కిలి పుణ్యుం(డు) దారకీర్త్తిల
|
|
- ↑ "లెన్నంగ" అని యుండనోపు.
- ↑ "బావులు కల్పించె" అని యుండనోపు.
- ↑ గణము తప్పిది.
- ↑ "శీతకరుండ" అని యుండనోపు.
- ↑ ఈపాదము "షేకు ముసమియ్య నరపాలశేఖరుండ" అని యుండనోపు.