Jump to content

పుట:Shaasana padya manjari (1937).pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

19.

శాసనపద్యమంజరి.


23.

శ. స.1114

ఇది పశ్చిమగోదావరీమండలమందు పాలకొల్లు గ్రామములో శ్రీ రామేశ్వర స్వామియాల
యములో నొక రాతిస్తంభముమీఁద చెక్క బడినది. (South Indian Inscriptions
Vol. V. No. 173)

క. మనుశివ(వత్సర)సంఖ్యం బయో[1]
జిని శ్రీసోమేశ్వరునకు శ్రీదుగ్గి౬కిం చే
కొని రెణ్డుసంధ్య దీపము
లొనరంగ భణ్డరువు కొమరం డొగిం బెట్ట దగను.

24.


శ. స. 1123.


ఇది పశ్చిమగోదావరీమండలములో ఏలూరుమసీదులో నొకస్తంభముమీఁద
చెక్కబడి యున్నది. (South Indian Inscriptions Vol. V. No. 185)

చ. పురకర కైర వాప్తశశిభూరిశ కాబ్దము లొప్ప శాంజ్జి౯కిని
సరసి పురంబులో నిలిపే సంద్దియ[2] దీపము వెన్ని సెట్టికిం
దారుణీయ ఘంట్టసాలపురి దారమకును[3] ఫల మొద్ద వీరికిని
వరసుత యైనవాసమ ద్రువంబుగ నాశశి తారకంబుగాను.

ఈసంద్య దీపము సేకొని కన్న మపణ్డితులు నామన యు రెణ్డు
సంధ్యల నడపగలవారు.

..............................................................................................................

.

  1. గణము తప్పినది. వత్సర శబ్దమునకు బదులుగా మిత యని యుండిన సరిపోవును.
  2. సంద్దిఅయ- అని యుండవలెను.
  3. దారమకున్- అని చదువవలెను