Jump to content

పుట:Shaasana padya manjari (1937).pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20

శాసనపద్యమంజరి.

25

శ. స.1123

ఇది పశ్చిమగోదావరీమండలము ఏలూరుమసీదులో నొకస్తంభముమీఁద చెక్కఁబడినది. (South Indian Inscriptions Vol. V. No. 179)

చ.

పరగంగమ్మ[1] వైశ్యనిధి భట్టిపురేశుండు ప్రోలిసెట్టి కం
బురుహదళాక్షి ప్రోలమసు[2]పుత్రుండు యాయ్తమసెట్టి పెట్టె శ్రీ
సరసిపురంబు క్రిష్ణునకు సంధ్ధియ[3]దీపము శాశ్వతంబుగాం
బురకరకైరవాప్తశశిభూశకద్బము[4] లుర్వ్వి పర్వ్వంగాను.


దీని సేకొని కన్నమపండితు నమనపండి(తు)లు నడవంగ్గలవరు.

—————

26

శ. స. 1124

ఇది పశ్చిమగోదావరీమండలములో ఏలూరుమసీదులో నొకస్తంభముమీఁద చెక్కఁయున్నది. (South Indian Inscriptions Vol. V. No. 183)

చ.

చిరముగ ఘంటసాల యెఱసెట్లపుగోత్రము వెన్నిసెట్టికిని
సరసిజనేత్రి దారమకు సత్సుత వాసన వెట్టెం బద్మినీ
పురమున సోమనాథున కపూర్వ్వముగా నిరుసంధ్యదీప మా
సరసిజగర్భ్బవక్త్రకరచంద్రశశాంకశకాబ్దసంఖ్యలను.

—————

27

శ. స. 1131

ఇది పశ్చిమగోదావరీమండలములో ఏలూరుమసీదులో నొకస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. (South Indian Inscriptions Vol. V. No. 177)

సీ.

శశిరామరుద్రశకసమములం గేశవ
            మం(డ్డ)లేశ్వరుబంటు మహిమ వెలయ

  1. ఇంకొకగకార ముండవలయును.
  2. 'సు' కు బదులుగా 'కు' ఉండిన బాగుగా నుండును.
  3. "సంద్దియ" అని యుండనోపు. ఈపదము సంధ్యాశబ్దభవ మని గ్రహించునది.
  4. "శకాబ్ధము" అని యుండవలెను.