22
ఇది పశ్చిమగోదావరీమండలములోని ఏలూరుమసీదులో నొకస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. (South Indian Inscriptions Vol. V. No. 186.)
సీ. |
శ్రీశుభశకదరదిశవస్సరములు [1]
వేదత్రి(లో)చనరుంద్ర[2]సక్య[3]
వెలయంగ వైశఖ విమలసప్తమియును
సోమవాసరమున సుస్తిరముంగ
కొలని కేశవదే(వు)కొలికి[4] సుభటండు(ఎ)న[5]
పోతికేతనల[6] ప్రీతితమ్ముం
డిహలోకమున సుఖ వింతియ[7]సాలు వొ
మ్మని తల్లిదండ్రిని నత్లం[8] దలంచి
మదనసద్రిశుండు (కా)వన దివియప్రోలం[9]
డమరపురమున కర్తితో నరుగుచుండి
కొలనిసోమేస్వరునకును సలలితముంగా
సంధ్యదీపంబు వెటించ్చె సస్వతముంగ.
|
|
|
వరనాలుగు సిదెడసెట్టగోత్రవిలసద్ధిరుద్రసఖ్యల సురచితముగ సరసీపు
|
|
- ↑ "ధరాధీశవత్సరములు" అని యుండవలెను.
- ↑ రుంద్రశబ్డ మిచ్చట కుదురదు. ఒకటి యను నర్థమిచ్చు వేఱొకశబ్ద ముండవలయును
- ↑ "సంఖ్య" అని యుండవలెను.
- ↑ "కలికి" అని యుండనోపు.
- ↑ "భటుండెన" అని యుండనోపు.
- ↑ "కేతనలకు" అని యుండనోపు.
- ↑ "మింతియ" అని యుండనోపు.
- ↑ "నల్ల" అని యుండవలెనేమో.
- ↑ ఈపాదమందు చందోభంగము కలిగినది.