Jump to content

పుట:Shaasana padya manjari (1937).pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శాసనపద్యమంజరి.

7


క.

గుడియును జెఱువును వనమును
నడరిన నల్లిండ్లుం గ్రితియు న(ల?)పెన్నిధియునుం[1]
గొడుకులను సప్తసన్తతి
నొడంగూడంగ నిలిపి సరనం డొప్పెం గీర్త్తిని.

20

—————

7

శ. స. 1061

పశ్చిమగోదావరీమండలములో పాలకొల్లుగ్రామమందు శ్రీరామేశ్వరస్వామి యాలయప్రాకారములోపల నొకస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. South Indian Inscriptions Vol. V. 162.

క.

శ్రీరమణీయుండు సుజనా
ధారుండు విబుధనుతగుణనిధానుండు విజయ
శ్రీరమ్యమూర్త్తి గేతమ
గారాపుందనూజుం డభయకరుండు వొగడ[2].

1


క.

వెలనాంటికిం దొడ వనంగా
వెలసినకుఱుంగడలు గలుగు వీరుండు నిజదో
ర్బ్బలములను [3] బలిమియుం బాడియుం
గలవాం డధికారపదవి గలవాండు మహిని.

2


తరు.

శకమహిపాలకసంవత్సరములు
            శశినిదివియదిందుసంఖ్యగాం గీర్తి
సుకరుండు రాజేంద్రచోడనియిష్ట
            సుభటుండ్డు వెంగ్గడయ[4]సుతుండు సూర్య్యాక్కుం
డకలంక్కుం డైనక్షీరారామదేవుం
            డగుశంబునకు భక్తుండై శనిభవని

  1. "పెన్నిధియున్" అని యుండవలెను.
  2. గణము తప్పినది, "కరుండు వొగడంగన్" అని యుండనోపు.
  3. "ర్బ్బలమును" అని యుండవలెను.
  4. "వెంగ్గయ" అని యుండనోపు.