Jump to content

పుట:Shaasana padya manjari (1937).pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

శాసనపద్యమంజరి.


దీపింపంగ వేంగినకుల
దీపకుండై రెండు ... దీపము లిచ్చెన్.

3


క.

ఈగిరిశుదక్షిణోత్తర
భాగముల నహర్న్నిశములుం బాయక వెలుంగను
శ్రీగుణమణిభూష(ణుం డ)ను
రాగముతోం గోరి ధర్మ్మర . . . .

4

—————

6

శ. స. 1083

ఇది శాసనపద్యమంజరి ప్రథమభాగములోని 48 వ శాసనము చివరభాగము. ఈశాసనము గుంటూరుమండలము నరసారావుపేటతాలూకా తిమ్మాపురముగ్రామము వీథిలో నొకనాగస్తంభముమీఁద చెక్కఁబడినది. (A. R. 443 of 1915.)

క.

పరమపరుండైన గొంకీ
స్వరునిం బ్రతిష్ఠించి ధర్మ్మపరుండై లక్ష్మీ
పరుండై సొక్కమసరణయ
ధరదానము భూసురులకు దత్తము సేసెను.

17


క.

పరిమల ... ... ... . . .
పరగిన పంచమహాశబ్ద[1]ప్రణవంబులతోం
గర మొప్పు ధూపఘంటెయు
సరనయ గోంకీశ్వరునికి(ళ్య)ము యిచ్చెను.

18


క.

యవడిల[2] దూబవాడం
గ్రమమున పణ్డీస్వరమునం గడుధన్యముగా
నమరం గొంకీస్వరునికి
విమలంబగు దీపవర్త్తి వెలయంగం బెట్టెను.

19
  1. "పంచమహాశబ్ద" అన్నచో గణము తప్పినది.
  2. ప్రాసము తప్పినది.