| ఉ. |
పెట్టె నఖండదీపములు వేర్కలఠావులనెల్లం దన్నుం జేం
బట్టిన యాశ్రితులు[1] బుధులు[2] బంధులం జేకొని ప్రోచె వైరులను
మెట్టి ధరిత్రియెల్ల నిరమిత్రము సేయంగం బూనె బేర్మ్మితో
దట్టుండు గోంకభూపతికిం దామనపుత్రుడు సచ్చరిత్రమెయిని[3].
| 2
|
| క. |
జలధిరసఖేందుశకసమ
ములుగా నెఱియండు మకరమున సంక్రాంతిని
వలివేరి[4]భండారికి ని
శ్చలమతి దీపంబు నిలిపెం జంద్రార్కముగాను.
| 3
|
4
ఇది కృష్ణాజిల్లా దీవితాలూకా గంటసాలగ్రామములో జలాధీశ్వరస్వామి యాలయమునెదుట నున్న యొకపాలఱాతిమీఁద చెక్కఁబడినది. (A. R. 848 of 1917.)
| చ. |
(మతలుకటిం)పగా శకసమంబులు దర్క్కరసాంబరేందుస
మ్మితముగ నుత్తరాయణనిమిత్తమునం దతిభక్తిం బార్వ్వతీ
హితునకు ఘంటశాలజలధీశ్వరదేవర కాదిమూర్త్తి కా
నతసురచక్రవర్తికి మనఃప్రభవారికిం జంద్రమౌళికిన్.
| 1
|
| చ. |
ధ... ... ... వర్ద్ధనసుధాకరుం డెఱ్ఱమసె . . . . . .
............ వనజాయతాక్షి యనంగాం దగు........ పుత్రుండై
తనకును దల్లిదండ్రుల ... ... వుగాం బెనుంగొండశాసనుం
డ... ... గోటకొమ్మన గుణాఢ్యు.........త్రయిన్.
| 2
|
- ↑ చందస్సుచే "యాశ్రితుల్" అని ప్రథమాంతముగాఁ జదువవలెను. కాని యన్వయము కుదరదు.
- ↑ "బుధుల" అని యుండవలెను.
- ↑ "మైన్" అని యుండవలెను.
- ↑ "వలివేర్" అని యుండవలెను.