Jump to content

పుట:Shaasana padya manjari (1937).pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శాసనపద్యమంజరి.

3


పకమును సీతి[1]ఖండువులు భాతిగ విత్తియు (చ)౦ద్రసూర్య్యతా
రకముగ న్రిత్యవాద్యములు రాగముం గూడంగ నిచ్చె శూలికిని.

5


చ.

కర ముచితంబుతో నగరగాం డ్డడుగం జనగాద్యయెక్కశు
స్థిరమగు నాదివారమున చిందమలాడిన నెఱ్ఱమణ్డండిం
బరగిన యట్టి కాపసకుం బంకజలోచన (మ)౦డమాంబకుం
దిరముగం బుట్టెం గాపం డవధీరితపావనినాం బ్రసిద్ధుండై.

6


ఉ.

శ్రీవెలనాంటి గోంకన్రిపశేఖరు శ్రీకరుసిద్దిబేతవి
ద్రావణరావణాంతకపరాక్రము విక్రమచక్రి భూరితే
జోవిభవాభిరాముం డగు చోడన చక్రముం గొల్చి త్ప్రసా
దావహలీలం దాల్చిన మహాత్ముణ్డు గాపండు ధర్మ్మశీలు డై.

7


క.

చిరముగం దూబఱుత మహే
శ్వరునిం బ్రతిష్టించి రజతశైలము నా భా
సురముగ గుడి యెత్తించెను
గురుమతియై కాపనాయకుం డతిభక్తిని.

8

—————

3

శ. స. 1064

ఇది గుంటూరుమండలములో తెనాలితాలూకా వలివేరుగ్రామములో స్వయంభ్వేశ్వరస్వామి దేవాలయము నెదుట నొకఱాతిమీఁద చెక్కఁబడినది. (A. R. 676 of 1920.)

శా.

శ్రీరమ్యు(౦డ)గు గుండ్యబోయునికి సంసిద్ధంబుగా నుర్వ్వరను
శ్రీరామానిభదామమాంబికకు సత్సేవ్యుండు భవ్యుండు వొ
ల్పారం దా నుదియించె బోయు (౧)డెఱియం డాగుప్తజుం డాయనను
శూరత్వంబున దానశక్తినిం బ్రభను శుద్దాత్మికను దీరికను.

1
  1. "దీపకమున శీతి" అని యుండనోపు.