పుట:Saundarya-Lahari.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

46

సౌందర్యలహరి


నైనను ఊరనైనను ఒక్కతీరుననే వెన్నెలలఁ గాయుచుండునుగదా. దీనివలన నాతనికేమైన ముప్పుగలదా లేదు.

అరాళం తే పాళీయుగళమగరాజన్యతనయే
న కేషామాధత్తే కుసుమశరకోదణ్డకుతుకమ్,
తిరశ్చీనో యత్ర శ్రవణపథముల్లఙ్ఘ్య విలస
న్నపాఙ్గవ్యాసఙ్గో దిశతి శరసన్ధానధిషణామ్. 58

టీ. హే అగరాజన్యతనయే = ఓపార్వతీ, అరాళమ్ = వంకరయైన, తే = నీయొక్క, పాళీయుగళమ్-పాళీ = చెవితమ్మెలయొక్క, యుగళమ్ = జంట, కుసుమశరకోదణ్డకుతుకం-కుసుమశర = మన్మథునియొక్క, కోదండ = ధనుస్సుయందలి, కుతుకం = సౌభాగ్యమును, కేషాం = ఎవరికి, నాధత్తే = తోఁపఁజేయదు, యత్ర = ఏపాళీయుగమందు, తిరశ్చీనః = అడ్డముగాఁదిరిగిన, తవ = నీయొక్క, అపాఙ్గవ్యాసఙ్గః-అపాఙ్గ = కనుగొనలయొక్క, వ్యాసఙ్గః = ప్రచారము, శ్రవణపథం = చెవిత్రోవను, ఉల్లఙ్ఘ్య = దాఁటి, విలసన్ = మెఱయుచున్నదై, శరసన్ధానధిషణాం-శర = బాణములయొక్క, సన్ధాన = బారుచేయుటయందలి, ధిషణాం = ఊహను, కరోతి = కలిగించుచున్నది.

తా. తల్లీ, వంకరలైన చెవితమ్మెలనుజూచి యందు నీనేత్రములు అడ్డమయి చెవులనుగూడ దాఁటిపోవుచుండుటచే వాని నందఱును బాణములని తలఁచి, నీచెవితమ్మెలను పూవిలుకానివిండ్లని బ్రమయుదురు.

స్ఫురద్గణ్డాభోగప్రతిఫలితతాటఙ్కయుగళం
చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథమ్,
యమారుహ్య ద్రుహ్యత్యవనిరథమర్కేన్దుచరణం
మహావీరో మారః ప్రమథపతయే సజ్జితవతే. 59

టీ. హేభగవతి = ఓదేవీ, స్ఫురద్గణ్డాభోగప్రతిఫలితతాటఙ్కయుగళం-స్ఫురత్ = నిగనిగమెఱయుచున్న, గణ్డ = చెక్కిళ్లయొక్క, ఆభోగ =