పుట:Saundarya-Lahari.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టీకాతాత్పర్యసహితము

45


ప్రాతఃకాలమున, జహాతి = విడుచుచున్నది, నిశిచ = రాత్రియందు, విఘటయ్య = తెఱచి, ప్రవిశతి = లోపలఁజేరుచున్నది. (పగలు దేవికనులయందు రాత్రి కలువయందు లక్ష్మి వసించును, చేఁపలుమున్నగునవి లక్ష్మికి చదురులు గావుగనుక నేత్రసామ్యమునకుఁ దగవు.)

తా. తల్లీ, చెవులవఱకు నల్లుకొని యనిమేషతగల నీకనులు తనగుట్టు బయలుచేయునని జడిసి చేఁపలు నీళ్లలో దాఁగినవి (దేవీ నేత్రములయందలి యనిమేషత తమకడనుండుటచే దొంగతనముఁబెట్టునేమో యని భయము) నీనేత్రలక్ష్మి రాత్రియంతయు కలువయందుండి యుదయముననే దానిని దళములతో మూసివచ్చి పగలంతయు నీకన్నులలోనుండి మఱల రాత్రి దళముల తలుపుదెఱచికొని కలువలోఁ జేరుచున్నది. ఇఁక నీనేత్రములకీడగు వస్తువే లేదని తా.

దృశా ద్రాఘీయస్యా దరదళితనీలోత్పలరుచా
దవీయాసం దీనం స్నపయ కృపయా మామపి శివే,
అనేనాయం ధన్యో భవతి న చ తే హానిరియతా
వనేవా హర్మ్యేవా సమకరనిపాతో హిమకరః. 57

టీ. హేశివే = ఓతల్లీ, ద్రాఘీయస్యా = మిగులనిడుపగు, దరదళితనీలోత్పలరుచా-దర = కొంచెము, దళిత = పూఁచిన, నీలోత్పల = నల్లకలువయొక్క, రుచా = కాంతివంటికాంతిగల, దృశా = చూపుచేత, దవీయాసమ్ = దూరముననున్న, దీనమ్ = నిరుపేదయగు, మామపి = నన్నును, కృపయా = దయతోడ, స్నపయ = తడుపుము, అనేన = ఈమాత్రముచేత, అయమ్ = వీఁడు (నేను), ధన్యః = కృతార్థుఁడు, భవతి = అగును, ఇయతా = ఇంతమాత్రముచేతనే, తే = నీకు, హానిః = ముప్పు, నచ = లేదు, హిమకరః = చంద్రుఁడు, వనేవా =అడవియందైనను, హర్మ్యేవా =మేడయందైనను, సమకరనిపాతః-సమ = తుల్యమగు, కర = వెలుగులయొక్క, నిపాతః = ప్రసారముగలవాఁడుగదా.

తా. తల్లీ, దీర్ఘమయి అరవీడినకలువవలె నందమైన నీచల్లనిచూపుచే దూరమునఁబడియున్న నన్నొకసారి దయచేసిచూడుము. ఈమాత్రముకృపఁజూపిన నేధన్యుఁడనగుదును. ఇంతలో నీకేమియుబాధలేదు. చంద్రుఁ డడవి