పుట:Saundarya-Lahari.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టీకాతాత్పర్యసహితము

47


విశాలదేశములయందు, ప్రతిఫలిత = ప్రతిబింబించిన, తాటఙ్క = కర్ణపూరములయొక్క, యుగళం = జంటగల, ఇదం = ఈ, తవ = నీయొక్క, ముఖం = మొగమును, చతుశ్చక్రం = నాలుగుగాండ్లుగల, మన్మథరథం = మదమనితేరునుగా, మన్యే = తలచెదను. మారః = మన్మథుఁడు, యం = ఏరథమును, ఆరుహ్య = ఎక్కి, మహావీరస్సన్ = గొప్పవిలుకాఁడై, అర్కేన్దుచరణం-అర్కేన్దు = సూర్యచంద్రులే, చరణం = గాండ్లుగాఁగల, అవనిరథం = భూమియనురథమును, సజ్జతవతే = పూన్చికొనియున్న, ప్రమథపతయే = ప్రమథగణములకు ప్రభువగు (గొప్పసైన్యముగల) నీశ్వరునికొఱకు, ద్రుహ్యతి = చెట్టఁజేయుచున్నాఁడు.

తా. తల్లీ, నీమెఱుఁగు చెక్కిళులయందు ప్రతిఫలించి నాలుగుగాఁ దోఁచుచున్న రెండుకమ్మలుగల యీనీముఖమునుజూచి యిదినాలుగుగాండ్లు గల మన్మథునితేరుగాఁ దలంచెదను. దేని నెక్కి మన్మథుఁడు సూర్యచంద్రులుగాండ్లుగాఁగల భూమియను రథమునెక్కిగొప్పప్రమథసైన్యమును వెంటఁ దీసికొనివచ్చిన యీశ్వరునితో నళుకులేక ప్రతిఘటించుచున్నాఁడో.

సరస్వత్యాస్సూక్తీరమృతలహరీకౌశలహరీః
పిబన్త్యాశ్శర్వాణి శ్రవణచుళుకాభ్యామవిరళమ్,
చమత్కారశ్లాఘాచలితశిరసః కుణ్డలగణో
ఝణత్కారైస్తారైః ప్రతివచనమాచష్ట ఇవ తౌ. 60.

టీ. హేశర్వాణి = ఓదేవీ, అమృతలహరీకౌశలహరీః-అమృత = అమృతముయొక్క, లహరీ = ప్రవాహపుపొర్లికలయొక్క, కౌశల = సొంపును, హరీః = హరించుచున్న, తే = నీయొక్క, సూక్తీః = తేనెపలుకులను, శ్రవణచుళుకాభ్యాం-శ్రవణ = చెవులనే, చుళుకాభ్యాం = పుడిసిళ్ళచేత, ఆవిరళం = తెఱిపిలేకుండఁగా, పిబన్త్యాః = జుఱ్ఱుచున్న, చమత్కారశ్లాఘాచలితశిరసః-చమత్కార = పాటయందలి యందమును, శ్లాఘా = మెచ్చుకొనుటయందు, చలిత = ఊఁగించఁబడిన, శిరసః = తలగలిగిన, సరస్వత్యాః = సరస్వతీదేవియొక్క, కుణ్డలగణః-కుణ్డల = కర్ణపూరములయొక్క, గణః = సమూహము, తారైః =