పుట:Saundarya-Lahari.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38

సౌందర్యలహరి


యోగముకొఱకు గాదని సూచన), ప్రకోష్ఠే = ముంజేయియు, ముష్టౌచ = పిడికిలియు, స్థగయతిసతి = కప్పుచుండఁగా, నిగూఢాన్తరమ్-నిగూఢ = కప్పఁబడిన, అన్తరమ్ = నడుముగల, ధనుః = వింటినిగా, మన్యే = తలఁచెదను.

తా. జగములకీడు బాపఁజూచునోయమ్మా, కొంచెముగావంగిన నీకనుబొమలను, తుమ్మెదలబారులై చూడనొప్పు నీకనులే యల్లెత్రాడుగాఁగలదియు కుడిచేతఁ బట్టుకోఁబడినదియు పిడికిటను ముంజేతిచాటునను మాటువడిన మధ్యదేశముగల మన్మథుని దాఁపుడుధనుస్సుగా నెన్నెదను. (నాసికయు నొసలును ముంజేతితోను పిడికిలితోను బోల్పబడెను. బొమలు వింటితోఁ బోల్పఁబడియెను.)

అహస్సూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా
త్రియామాం వామం తే సృజతి రజనీనాయకతయా,
తృతీయా తే దృష్టిర్దరదళితహేమామ్బుజరుచి
స్సమాధత్తే సన్ధ్యాం దివసనిశయోరన్తరచరీమ్ 48

టీ. హేభగవతి = ఓపార్వతీ, తే = నీయొక్క, సవ్యం = ఎడమదగు, నయనం = కన్ను, అర్కాత్మకతయా = సూర్యరూపమగుటచేత, అహః = పగటిని, సూతే = కలిగించుచున్నది, వామం = ఎడమదగు, నయనం = కన్ను, రజనీనాయకతయా = చంద్రుఁడగుటచేత, త్రియామాం = రాత్రిని, సృజతి = కలిగించుచున్నది, దరదళితహేమామ్బుజరుచిః = కొంచెముగాఁ బూచినబంగారుకమలమువంటిదగు, తే = నీయొక్క, తృతీయా = మూఁడవదగు, దృష్టిః = కన్ను, దివసనిశయోః = దివారాత్రులమొక్క, అన్తరచరీం = నడిమిదగు; సంధ్యాం = ప్రాతస్సాయంరూపమగు సంధ్యను, సమాధత్తే = చక్కఁగాఁ జేయుచున్నది.

తా. తల్లీ, నీకుడికన్ను సూర్యుఁడుగనుక పగ లొనర్చుచున్నది నీయెడమకన్ను చంద్రుఁ డగుటచేత రాత్రిని జేయుచున్నది. అరవీడిన బంగారు తామరవలె నుండు నీఫాలముననుండు మూఁడవకన్ను (అగ్ని నేత్రము) ప్రాతస్సాయసంధ్యలను జేయుచున్నది. ఇచ్చట రాత్రి పవలు సంధ్య యనువాని