పుట:Saundarya-Lahari.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టీకాతాత్పర్యసహితము

39


చే పక్షమాసర్తుయుగకల్పాదిరూపకాలోత్పత్తిఁ జెప్పుటచే దేవినేత్రములచేత సర్వకాలోత్పత్తి యగుటవలన, శక్తికి కాలబాధ్యత్వము లేదనుట.

విశాలా కల్యాణీ స్ఫుటరుచిరయోధ్యా కువలయైః
కృపాధారాధారా కిమపి మధురా భోగవతికా,
అవన్తీ దృష్టిస్తేబహునగరవిస్తారవిజయా
ధ్రువం తత్తన్నామవ్యవహరణయోగ్యా విజయతే. 49

టీ. హేభగవతి = ఓతల్లీ, తే = నీయొక్క, దృష్టిః = చూపు, విశాలా = విపులమై, కల్యాణీ = మంగళకరమై, స్ఫుటరుచిః = చక్కనికాంతిగలదై, అయోధ్యా = పోరనలవికానిదై, కువలయైః = కలువలచేత, కృపాధారాధారా = కరుణాప్రవాహనిలయమై, కిమపి మధురా = అవ్యక్త (చెప్పనలవికాని) మధురమై, భోగవతికా = లోపలవిశాలముగలదై, అవంతీ = కాపాడునదియై, బహునగరవిస్తారవిజయా-బహు = అనేకములైన, నగర = పట్టణములయొక్క, విస్తార = సమూహముయొక్క, విజయా = విజయముగలదై, ధ్రువం = నిజముగా, తత్తన్నామవ్యవహరణయోగ్యా-తత్తన్నామ = (విశాల, కల్యాణి, అయోధ్య, ధార, మధుర, భోగవతి, అవంతి, విజయ అను) నానగర నామములచే, వ్యవహరణ = వాడుటకు, యోగ్యా = తగినదై, విజయతే = వెలయుచున్నది. (విశాలమొదలు విజయవఱకు నెనిమిదినగరములు గలవు. అట్లే యెనిమిదివిధములదృష్టులుగలవు. వీనిలో విశాలాదృష్టి లోపల వికాసముగలది, కల్యాణీదృష్టి విస్మయముగలది, అయోధ్యాదృష్టి తెఱవఁబడిన నల్లగ్రుడ్లుగలది, ధారాదృష్టి అలసమైనది, మధురాదృష్టి చంచలమైనది, భోగవతీదృష్టి మసృణమైనది, అవంతీదృష్టి ముగ్ధమైనది, విజయాదృష్టి చెంతలఁ జేరిన నల్లగ్రుడ్లుగలది, ఆకేకరలను నివి యందఱు వనితలకుఁఁ దుల్యములే. దేవియం దివి క్రమముగా సంక్షోభ, ణాకర్షణ, దావ, ణోన్మాదన, వ, శ్యోచ్చాటన, విద్వేషణ, మారణక్రియలను జేయును. దేవి యెచ్చటనుండి విజయను నాకేకరదృష్టిచే శత్రువుల సమయించెనో యది విజయాపట్టము.