పుట:Saundarya-Lahari.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టీకాతాత్పర్యసహితము

37


విపర్యాసన్యాసాదుభయమపి సమ్భూయ చ మిథ
స్సుధాలేపస్యూతిః పరిణమతి రాకాహిమకరః. 46

టీ. హేభగవతి = ఓతల్లీ, తవ = నీయొక్క, లావణ్యద్యుతివిమలం-లావణ్య = నిగనిగలాడుకాంతియనే, ద్యుతి = వెన్నెలచేత, విమలమ్ = నిర్మలమైన, యత్ లలాటమ్ = ఏనొసలుగలదో, తత్ = దానిని, మకుటఘటితమ్ = ఔదలఁదాల్పఁబడిన, ద్వితీయమ్ = రెండవదగు, చన్ద్రశకలమ్ = జాబిల్లితునుకఁగా, మన్యే = ఊహించెదను, యత్ = ఏకారణమువలన, ఉభయమసి = రెండును, విపర్యాసన్యాసాత్ = తలక్రిందులుగా (నాలుగుకొమ్ములు గలియునట్లు) నుంచుటవలన, మిథః = ఒకటినొకటి, సమ్భూయచ = కలసికొని, సుధాలేపస్యూతిః = అమృతపుఁబూతఁగలిగిన, రాకాహిమకరః = పూర్ణిమాచంద్రుఁడుగా, పరిణమతి = మాఱుచున్నదో.

తా. తల్లీ, నిగారపుఁదళుకులచే నందమైననొసలు తలయందుఁ దాల్చఁబడినదానికంటె వేఱైనచంద్రుని రెండవతునకయనియే నానమ్మకము. కాదేని యీరెంటిని నాలుగుమూలలు కలియునట్లు సరిగా నదికినయెడల పండువెన్నెలతోనిండిన నిండుజాబిల్లికానేల? నొసలర్ధచంద్రునివంటిదనిభావము.

భ్రువౌ భుగ్నే కించిద్భువనభయభఙ్గవ్యసనిని
త్వదీయే నేత్రాభ్యాం మధుకరరుచిభ్యాం ధృతగుణమ్,
ధనుర్మన్యే సవ్యేతరకరగృహీతం రతిపతేః
ప్రకోష్టే ముష్టౌ చ స్థగయతి నిగూఢాన్తరముమే. 47

టీ. హేభువనభయభఙ్గవ్యసనిని = లోకముల కీడుబాప నాసగొనిన యోతల్లీ, త్వదీయే = నీవగు, కించిద్భుగ్నే = కొంచెముగావంగిన, భ్రువౌ = కనుబొమలను, మధుకరరుచిభ్యామ్ = తుమ్మెదలవంటి కాంతిగల, నేత్రాభ్యామ్ = కనులచేత, ధృతగుణమ్-ధృత = కట్టఁబడిన, గుణమ్ = అల్లెత్రాడుగల, రతిపతేః = మన్మథునియొక్క, సవ్యేతరకరగృహీతమ్ = కుడిచేతఁ బట్టుకోఁబడిన (కుడిచేయి యనుటచే నెప్పుడు నొకచేతనే పూనఁబడినది యిది బాణప్ర