పుట:Saundarya-Lahari.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టీకాతాత్పర్యసహితము

5

టీ. హేభగవతి = ఓతల్లీ, ఏషః = ఈనీపాదరేణువు, అవిద్యానాం = అజ్ఞానులకు, అంతస్తిమిరమిద్వీపనగరీ-అంతః = లోపలనున్న, తిమిర = అజ్ఞానమునకు, మిహిరద్వీపనగరీ = సూర్యుఁడుదయించెడు ద్వీపమునకు నెలవైనది, జడానాం = మూఢులకు, చైతన్యస్తబకమకరందసృతిఝరీ-చైతన్య = ఆగతానాగతపరిజ్ఞానప్రదమగుచైతన్యమనెడు, స్తబక = పూగుత్తియొక్క, మకరంద-పూఁదేనియయొక్క, సృతి = స్రవణముయొక్క, ఝరీ = జాలు, దరిద్రాణాం = దీనులకు, చింతామణిగుణనికా-చింతామణి = చింతారత్నముయొక్క, గుణనికా = గుణములప్రోవు, జన్మజలధౌ = సంసారార్ణవమున, నిమగ్నానాం =మునిఁగినవారికి, మురరిపువరాహస్య = వరాహరూపుఁడగు విష్ణువుయొక్క, దంష్ట్రా = కోరయు, భవతి = అగుచున్నది.

తా. తల్లీ, నీపాదరేణువు అజ్ఞానులయొక్క యజ్ఞానమునకు సముద్రాంతర్గతసూర్యోదయద్వీపమున కాశ్రయ మైనది. (అనఁగా నజ్ఞానతిరస్కారకము) మూర్ఖులకు ఆగతానాగతపరిజ్ఞానరూపచైతన్యమనెడు కల్పవృక్షపుష్పగుళుచ్ఛముయొక్క తేనెజాలు, దరిద్రులకు చింతామణిగుణసమూహము, సంసారసాగరమున మునుగువారలకు వరాహదంష్ట్రయు ననుట.

త్వదన్యః పాణీభ్యామభయవరదో దైవతగణ
స్త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా,
భయాత్త్రాతుం దాతుం ఫలమపి చ వాఞ్ఛాసమధికం
శరణ్యే లోకానాం తవహి చరణావేవ నిపుణౌ. 4

టీ. లోకానాం = లోకములకు, శరణ్యే = రక్షకురాలవగు, హేభగవతి = ఓతల్లీ, త్వదన్యః = నీకంటెవేఱైన, దైవతగణ్య = దేవసముదాయము, పాణిభ్యాం = చేతులతో, అభయవరదః = అభయవరముద్రలను ధరించుచున్నది. ఏకా = (ఒక) ముఖ్యురాలగు, త్వమేవ = నీవుమాత్రమే, పాణిభ్యాం = హస్తములచేత, ప్రకటితవరాభీత్యభినయా-ప్రకటిత = వెల్లడింపఁబడిన, వరాభీత్యభినయా = వరాభయవ్యంజకముద్రలను ధరించుదానవు, నైవాసి = కావుగదా,