పుట:Saundarya-Lahari.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

సౌందర్యలహరి


శివకేశవచతుర్ముఖాదులచేతను పరిచర్యచేయఁదగు నిన్ను పుణ్యలేశమైనఁ జేసి యెఱుఁగని నాబోటివాఁడు మ్రొక్కుటకొఱకుగాని పొగడుటకొఱకుగాని యె ట్లర్హుఁ డగును.

తనీయాంసం పాంసుం తప చరణపఙ్కేరుహభవం
విరిఞ్చిస్సఞ్చిన్వన్ విరచయతి లోకానవికలమ్,
వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం
హరస్పఙ్క్షుద్యైనం భజతి భసితోద్ధూళనవిధిమ్. 2

టీ. హేభగవతి = ఓతల్లీ, విరంచిః = బ్రహ్మ, తవ = నీయొక్క, చరణ పంకేరుహభవమ్ = పాదకమలమునఁ బుట్టిన, తనీయాంసమ్ = సూక్ష్మమైన, పాంసుమ్ = పరాగమును, సంచిన్వన్ = గ్రహించుచున్నవాఁడై, లోకాన్ = జగములను. అవికలమ్ = సమగ్రముగా, విరచయతి = నిర్మించుచున్నాఁడు. శౌరిః = విష్ణువు, ఏనమ్ = ఈపరాగకణమును, శిరసామ్ = తలలయొక్క , సహస్రేణ = వేయింటిచే, వహతి = మోయుచున్నాఁడు, హరః = శర్వుఁడు, ఏనమ్ = దీనిని, సంక్షుద్య = చక్కఁగామెదిసి, భసితోద్దూళనవిధిమ్ = భస్మధారణవ్యాపారమును, భజతి = పొందుచున్నాఁడు.

తా. తల్లీ, బ్రహ్మ నీపాదరేణు వొకింతసంపాదించి లోకములనిర్మించుచున్నాఁడు. ఆపరాగకణమునే విష్ణువు మిగుల నాయాసముతో వేయితలలచే మోయుచున్నాఁడు. దానినే యీశ్వరుఁ డంగరాగమునుగా సుపయోగించు కొనుచున్నాఁడు.

అవ. ఆపరాగమునే స్తుతించుచున్నారు —

అవిద్యానామన్తస్తిమిరమిహిరద్వీపనగరీ
జడానాం చైతన్యస్తబకమకరన్దసృతిఝరీ,
దరిద్రాణాం చిన్తామణిగుణనికా జన్మజలధౌ
నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. 3