పుట:Saundarya-Lahari.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సౌందర్యలహరి

టీకాతాత్పర్యసహితము.

అవతారిక. తత్త్వవేది యగుశ్రీశంకరులు సమయయను చంద్రకళను పద్యశతముచేఁ బ్రస్తుతించుచున్నారు. —

శ్లో. శివశ్శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం
    న చేదేవం దేవో నఖలు కుశలః స్పన్దితుమపి,
    అతస్త్వామా రాథ్యాం హరిహరవిరిఞ్చాదిభిరపి
    ప్రణన్తుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి. 1

టీక. హేభగవతి = షడ్గుణైశ్వర్యసంపన్నురాలవగు ఓతల్లీ, శివః = సర్వమంగళోపేతుఁడైన సదాశివుఁడు, శక్త్యా =జగన్నిర్మాణశక్తిచేత, యుక్తః = కూడినవాఁడు, భవతియది = అగునేని, ప్రభవితుం= ప్రపంచనిర్మాణముకొఱకు, శక్తః = సమర్ధుఁడగును, ఏవమ్ = ఈలాగునశక్తియుక్తుఁడు, నచేత్ = కాఁడేని, స్పందితుమపి = కదలుటకును, కుశలః = నేర్పరి, నఖలు = కాఁడుగదా, అతః = ఇందువలన, హరిహరవిరిఞ్చాదిభిరసి = విష్ణుశంకరబ్రహ్మాదులచేతను, ఆరాధ్యామ్ = కొలువఁదగిన, త్వామ్ = నిన్ను , ప్రణంతుమ్ = మ్రొక్కుటకుగాని, స్తోతుంవా = పొగడుటకుగాని, అకృతపుణ్యః = చేయఁబడనిపుణ్యముగలవాఁడు, కథం = ఎట్లు, ప్రభవతి = సమర్థుఁడగును,

తాత్పర్యము. తల్లీ : ఈశ్వరుఁడును జగన్నిర్మాణశక్తితోఁగూడిననే జగముల నిర్మింపంజాలునుగాని యదిలేనియెడ కదలుటకు జాలఁడు. కనుక