పుట:Saundarya-Lahari.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

సౌందర్యలహరి


హి = ఇట్లని, తవ = నీయొక్క, చరణావేవ = పాదములే, భయాత్ = భయమునుండి, త్రాతుం = కాపాడుటకొఱకున్ను, వాంఛాసమధికం = కోర్కె కెక్కువైన, ఫలం = ఇష్టలాభమును, దాతుం = ఇచ్చుటకును, నిపుణౌ = నేర్చినవి.

తా. తల్లీ, ముఖ్యురాలవగు నీకంటె వేఱైన దేవతలందఱు హస్తములచే నభయపరముద్రలఁ దాల్చుటయునీవు మాత్రము పూనకుండుటయుఁ గాంచి నీపాదములే భయమునుండి తొలగించుటకును కోరినదానికంటె యెక్కువగా నిచ్చుటకును నేర్చియున్నవి. గాన నీవు ముద్రలఁ బూనుట వ్యర్థము.

హరిస్త్వామారాధ్య ప్రణతజనసౌభాగ్యజననీం
పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్,
స్మరో౽పి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా
మునీనామప్యన్తః ప్రభవతి హి మోహాయ జగతామ్. 5

టీ. హేభగవతి = ఓతల్లీ, హరిః = శ్రీవిష్ణువు, ప్రణతజనసౌభాగ్యజననీం-ప్రణత = నమ్రులైన, జన = లోకులకు, సౌభాగ్యజననీం = ఐశ్వర్యప్రదురాలవగు, త్వాం = నిన్ను, ఆరాధ్య = పూజించి, పురా = పూర్వము, నారీభూత్వా = ఆఁడుదిగానయి, పురరిపుమపి = ఈశ్వరునిఁగూడ, క్షోభం = కలఁతను, అనయత్ = పొందించెను. స్మరో౽పి = మన్మథుఁడును, త్వాం = నిన్నుఁగూర్చి, నత్వా = ప్రణమిల్లి, రతినయనలేహ్యేన-రతి = రతీదేవియొక్క, నయన = కన్నులచే, లేహ్యేన = ఆస్వాదించఁదగిన, వపుషా = ఒడలితో, మునీనామపి = మననశీలురగు మహాత్ములయొక్కయు, అన్తః = మనస్సును, మోహాయ = మోహింపఁజేయుకొఱకు, ప్రభవతిహి = సమర్థుఁడగుచున్నాఁడుగదా.

తా. తల్లీ, విష్ణువు భక్తవరదురాలును శ్రీచక్రరూపిణి యగునిన్ను గొల్చి పూర్వ మొకయాఁడుదిగా నయి యీశ్వరునిఁగూడ మోహపెట్టెను. అట్లే మదనుఁడును నిన్ను సేవించి త్రిలోకసుందరుఁడయి మునిమనములను సయితము మోహింపఁజేయునుగదా.