పుట:Satya harishchandriiyamu.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కోరిన ధనమిచ్చి కొనఁ దగుసుండి వారణాసి పౌరవరు లార రండి

(ఆకసమువంకఁ జూచి) ఏమీ! ఇతఁడెట్టి వాడఁనుచున్నారా?

సీ. తన మహీరాజ్యమంతయు గాధిసూతికిన్‌ దాన మిచ్చిన యట్టి ధర్మ మూర్తి నిజ యశశ్చంద్రికల్‌ నిఖిల దిక్కులయందుఁ బాఱఁజల్లిన యట్టి సారగుణుండు ముల్లోకములను సమ్మోదింప భేతాళు మద మడంచిన విక్రమస్థిరుండు అణుమాత్రమైన బొంకను మాట యెఱుగని యసమాన నిత్య సత్య వ్రతుండు గీ. ఏడు దీవుల నవలీల నేలినట్టి సాంద్ర కీర్తి హరిశ్చంద్ర చక్రవర్తి బానిసీడుగ నమ్మంగఁ బడెడు కొనుఁడు పౌరులార మహాధనోదారులార

హరి: ఎవరు కొనకున్నారు. ఇంకెంతని యఱిచెదరు? వీఁడెవఁడో కడజాతి వానివలె నున్నాఁడు. ఇటె వచ్చుచున్నాఁడు. ఉండుము.

(పిమ్మట వీర బాహు ప్రవేశించుచున్నాఁడు) వీరబాహు: (గేయము)

తొలగిపోనిండయ్య! దొరలు పెద్దింటోణ్ణి తెరచి చెప్పకుంటే పలువ పొమ్మంటారు ॥తొ॥ పబులు మీకుక్కల కట్టి వేస్కోండయ్యా ॥తొ॥ గబగబ బౌవంచు కఱవ వత్తుండయ్యా వాదనంటారు సూదోచ మంటారు నే కాచంత కల్లేసి కాటికి పోతుండ ॥తొ॥

నక్ష: హరిశ్చంద్రా! ఇంక నిన్నెవ్వరు కొందురు?