పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

శ్రీకాకుళము

సభలో నొక రిచ్చినకల్పన,

ఉ|| సారయశస్కు లౌఘనులసచ్చరితములు గాంచియన్యులున్
భీరతఁ గాంత్రు వారిఁ గని తెల్వినిఁ గొందురు ఏరివంశ్యులున్
భూరిరజోవలిప్త మయి పొల్చెడి త్రోవను బట్టి యేగున
వ్వారిపదమ్ములన్ దెలియవచ్చెడిగా పథ మట్టి దేనియున్7

అన్న దాన ప్రశంస.

శా! దానమ్ముల్ వివిధమ్ము లుండినను నద్దానములం దెల్ల నా
త్మానందం బొనఁగూర్పఁ జాలు నది యన్నాఖ్యంబ, దీవ్యంబు నెం
తేనిన్ దెచ్చి యొసంగిన మనము తృప్తిం జెందఁగాఁబోవ దే
రినిన్ దృప్తి ని గాంతు రన్న ముస నేరిద్దాని శ్లాఘింపరో!8

అగ్గిపెట్టె

క||ప్రతిదినము నగ్గి కంచున్, సతి ప్రతి గేహంబు దిరుగఁ జనుపని తప్పెన్
మతిమంతు లగ్గి పెట్టిని,గతి గాఁ గల్పించుటన్ సుఖం ' బలరారెన్"9

బాలవిధవలకుఁ దలగొరగఁ దగదనుట,

సీ|| అతి బాల్యమున భర్త గతియించినట్టియక్కన్నెకు విజ్ఞానమన్న సున్న,
యట్టిచిన్నతనాన సప్పసిగోలకుఁ దల గొరిగింప యత్నంబొనర్చు, కన్న
ను సజ్ఞాన మున్నె ! యేమన్న సన్న్యాసికే యది గొను టతిభరమ్ము
గాఁ దోచు నెట్లేనిఁ గానిమ్ము . ప్రకృతము వచియింతు సర్వానుభవ మగుగతి.

............................................................................

చ|| ఘటిక కునూరు పద్యములు కల్పన సేయ సమర్థు నాహ్వయౌ |
నటుల శతావధానముల నైన వొనర్పం బ్రవీణుసంధ్య నా !
నటదగ జేశమౌళి చలనభ్రమ దభ్రభునీఝురీ సము |
తటవచన ప్రవాహు సముదగ్రమహోభయ సాహితీవధూ |
విటునిసభామనోహర నవీనకరారచనాధురీణు ది |
క్తటసముదీణన్ కీర్తి లతి కాతతిశాబ్దిక తార్కిక మహోద్భటుఁ
జటుగానకోవిదుని బ్రాహ్మణసత్తము చెళ్లపిళ్ల వేం
కటకవిసార్వబౌముని దగన్ వినుతింపగ శక్యమే ధరన్ | ...1

ముక్కవిల్లి సాంబయ నామకవి రచితం,