పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శతావధానసారము, ఉత్తరార్థ ము .

85


పరమాత్మునిం గూర్చి -

చ||సిరు లీడు నేమహామహుని సేవన, మెన్వరి కేని సౌఖ్య ముల్
పరంగఁగఁజేయు నేమహితు పాదనమస్కృతి, జ్ఞాన మిచ్చునే
పరము నినామసంస్కరణ, భద్రద మన్వనివృత్తి, తాదృశున్
జిరతరు నాదీపూరుషు భజింతు యజింతు సృజింతు సత్కృతుల్ 2

భక్తి నిగూర్చి, వసంతతిలకావృత్తమ్.

దారా స్సు తాశ్ద్రవిణం గృహమం బరాణి
కాయం చ నిత్య మితి మాభ్రమ మూఢ చేతః
భక్తిం కురుష్వ పరమాత స నిర్గుణేవా
నోచే సహాగుణయుతే తరణాయ నిత్యం3

సప్త సం తానములలో కృతి యధికమగుట.

తే|గీ|| || తనుజుఁడు తటాకమును గృతి ధరణి దివిజు
వరునిని నిల్పుట నివియును వనము శివుని
కాలయము గుట్టుటయు నీవి యగును సప్త
సంతతులు వీనిలో పల సతము కృతియ4

తలిదండ్రులలో తల్లి హెచ్చని సాధించుట.

తేట గీ|| కనుట యెంతేని నుత్కృష్ట కష్టమునను
నేవమున కియ్యకొని పెంచు టించుకంత
సేగి గల్గిన నెమ్మదిఁ జింత గొనుట.
తల్లి కగుటను నా పె యిద్దఱను హెచ్చు 5

ఉభయులలో తండ్రి హెచ్చని సాధించుట,

క|| తలిదండ్రు లిరువురందున్, సులలిత మతిశాలి నాత్మజుని జేసెడివా
డిలఁ దండ్రి గాన, నతనికి , బలుకందగుఁ దల్లికన్నఁ బ్రబలుఁడటంచున్

,

అద్వైతసిద్ధిని గూర్చి..

క || క్రమమున జ్ఞానము నా,శమగును నశ్యమగు నెల్లజగ మా పై డఁ
త్వమసి" యనెడివాక్యము నిక్కమగుట న ద్వైతసిద్ధిగలుగు దానన్ •