పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బెజవాడ

43

(రామాయణము)

శా॥ నీ రేజాప్త కులమునం బోడని యెంతే యోగ్యయా జానకిన్
దారంగాఁ గొని తండ్రియానతి సరణ్యానిం బ్రవేశించి భూ
భారం బెల్లను మాన్ప రక్కసులదర్బం బూడ్చి సాకేతమం
దేరాముండు సుఖములం గొనియె నే నీకింతు సద్దేవునికిన్4

(కృష్ణ) మాలిని.

సకలకలుషహంత్రీ సర్వసౌఖ్యప్ర గాత్రీ
విమలసలిలశోభా కృష్ణ వేణీ నదీయం
నిఖలమనుజనిత్యస్నా సపానాదియోగ్యా
జయతి విజయ నాటీ ప్రాంత దేశే నీ తాంతం5

శ్రీ. శ్రీ. శ్రీ.

బందరులో మరల సవధాసము చేయఁబడియెసు రికార్డు లేదు.


మన్మధ సం॥ భాద్రపదాశ్వయుజ మాసములలో విజయనగరములో జరిగిన యవధానములలోని కొన్ని పద్యములు

(ప్రకృతకపుల మనస్సు.).

సీ! ఒక్కడుగోరినవృత్త మొకఁడుగోరినవర్ణ్య మన్యోన్య సాంకర్య మందకుండ
ఒక నిస్థానమున వేడొకఁడుగూర్చున్నచో దాని చేమార్గమ్ముదప్పకుండ
దలకిందుగా జెప్పవలె మాకనుచుఁగోర సందులో స్థాలిత్య మంగకుండ |
మధ్య మధ్యను జప్ప మా కిష్టమని చెప్ప సందులోవిభ్రాంతి చెందకుండ ,
 తే| గీ॥ సంస్కృతాంధ్రములందున శబ్దశాస్త్ర

...............................................................................................................

ఈ విజయనగరమున బ్రహ్మశ్రీ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రు లవారును దివాకర్ల తిరు పతి శాస్త్రులవారు నను తరుణవయస్కుడైన యిద్దరు విద్వత్కవులు శత లేఖనీక విశ్వము రెండుసార్లును అష్టావధాన మొక సారియు నిదివఱకు జరపి వారికళా నైపుణిని వెల్లడిచేసి యున్న వారు, వారిలో నష్టావధానము శ్రీ మహా రాజా వారి కాలేజీ విద్యార్థుల కోరిక చే గాఁబడినది. దానిలో నీకవుల నర్గళమైన విజయము పొందిరి. అపుడచటికిం జూడగోరి వచ్చియున్న యేనమందానందుండ నై 'నా సంతోషమును పెలిఁబుచ్చుచు నీ క్రిందిపద్య ములరచించితిని. కాన వానిని మీపత్రి కారత్న మ్మునఁ బ్రచురింపఁ జేసి నాకధిక సం తోషమాపాడింతురని నమ్ముచున్నాఁడను. ఈ శ్రీవరభక్త మానసవి శేష సుఖాకరుఁడ వ్యయుండు స | త్పాపనపాలకుండు వసు ధాతలపోషకుఁ డాదిమూర్తి దీ నావనబద్ధ .