పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెంకటగిరి,

39


-రాటం. గిరిం బ్రవేశించి! 37|| క||సుర నాయకుండు నిర్జర | పురముకరణి నక్కు- మారభూమిపతియు | ద్ధురమహిమ నలరి వేంకట, గిరిపురిఁ దానేలు చుండెఁ గీర్తి కిఁ దావై | 38 ||

శ్రీ శ్రీ శ్రీ

రామేశ్వరయాత్ర సంపూర్ణము.

పెద్ద ప్రభువగు శ్రీ రాజగోపాలకృష్ణ యాచేంజుల వారి యష్టావ ధానములోని కొన్ని పద్యములు,


శ్లో|| వందే నందయశోది కాచిరతపఃకందం, సురేంద్రాదిభి ర్వంద్యం నింద్య సురారీదుర్మదహరం, వందారు బృందావనం చందచ్చందనశీతలం, నిరుపమానందప్రదం దేహినా మీంద్రప్రస్తరసుందరం దరధరం సందారి తాంహస్త తిం||1

సీ|| చదువఁ జేసితికదా! శబ్దశాస్త్ర రహస్య సమితి నాలుగువత్సరములలో స | ద్రోవ చూపితికదా ! దుర్గ్రహమ్మగు ధాతు రత్నాకరాజ్య సద్గ్రం థమునకుఁ | జెప్పఁ జేసితిక దా! శ్రీకాళికా సహస్రదీ కావ్యములు బాల్యములో సఁ ! జేయఁ జేసితీక దా! చెలఁగి మూలస్థానపతిమీఁద గం టలోఁ బద్యశతము ,

తే| గీ||మఱియు నెన్నేనిసభలలో మనిచియుంటి విపుడు శ్రీరాజగోపాలకృష్ణయాచ భూప బహద ర్మహారాజు భూరి సభను సెట్లు మెప్పించెదో! భవానీ! మదంబ!

(హనుమంతుఁడు సీతఁగాంచి వచ్చుట .)

మ॥! వసధిం దాఁటి యనేక రాడు.సనధూవర్గమ్ములో నమ్రితా నసయై 'రామ! యటంచుఁ గన్నులఁ గదుష్ణం బై నకన్నీరు నిం చిన నా రాక్షసు లెల్ల భీతిగొలుప జింతిల్లుచుండంగ నే గనుఁగొంటి రఘురామ' భూతనయ, నక్కంజాక్షిఁ దేనెంచుమీ.

............................................................................................................

రామేశ్వరయాత్రలోని యాంజనేయస్తవము ఇటీవలఁ చెప్పిచేర్చినది - ఇందలి పుణ్యస్థలముల పేళ్లుకొన్ని శాస్త్ర విరుద్ధము లైన ను దానికి మేముత్త రవాదులము కాము. ఏమన! వారిచ్చిన జాబితాను బట్టి వ్రాసితిమి.