38
శతావదాన సారము పూర్వార్థము
.
జెలంగుమంగళ తీర్థమ్మును, నమృత వాపీ తీర్థమును సీతాకుండమ్మును సము ద్రమున నుండు బైరవతీర్థమును బొడఁగాంచి|| 32|| క॥ తరువాత యాచ రాజొక I తరి నెక్కి సమస్త విభవశతితో రాజు | త్త రసనపాషాణంబుల | దరి కేగెఁ బుగోహితాదితతితో గూడ || 33|| సీ|| అయ్యెడ నుండు జనార్దనుఁ గొసియాడి శ్రీదేవి భూదేవిఁ జిత్తగించి | సనశిలా మధ్య మునను దాస మాడి యు దేవిపట్న మునఁ దేజురిల్లు | మహిపాఖ్య రాష్ట్ర సమర్దని భజి యించి చక్రతీర్థమ్మున జలక మాడి యుప్పూరి సత్రమ్ము ఎప్పుగాఁ గన్గొని సుందపాండ్యము దారిఁ జొచ్చి పిదప!! తే| గీ॥! కోటపట్టణమును బట్టుకోట దాటి ! వందిమాగధులెల్లఁ గై వార మొసఁగ | భూమిసురు లెల్ల దీవనల్ పొందుపరప | రాజమన్నారుకోవెల రాజు గాంచే! 34|| సీ|| అట రాజు మన్నారు నభినతుఁ గావించి సత్య భామాదేవి సరవి మొక్కి | రుక్మిణీ దేవికి రుక్మమ్ము మొసఁగియు హేమాబ్జనయకి హెచ్చరించి | తనివితీర గ హరిద్రాతీర్థ మునఁ దాన మాడియుఁ గమలాలయంబు చేరి|నల్లనే శ్వరుపాదపల్ల వములు మ్రొక్కి నీలోత్పలాంబను జాలఁ గొలిచి తే: గీ|| యభినుతించియుఁ గమలాలయంబు పిదపుఁ |ద్యాగరాట్కమలాంబల నేగ మెరఁగి | భోగ, మర్పించి యంతటఁ బొలుపు దనర | నరపతియుఁ జేరె గుంభకోణంబు మరల|| 35|| వ|| అట నుండి తిరువణందారువేంచేసి యచ్చట|సీ ||అరుణజటేశ్వరు నారాధనము చేసి యాబృహన్నాయని కంజలి యిడి | చూచి యూజయగండచోళపరం బంత సటుమీదనీపు ష్ణమమరఁ జేరి ! భూ వరాహస్వామి సేవయొనర్చియు సంబుజపల్లికి నాన మ్రొక్కి | శ్రీ రామనిత్యోత్సవారాధనము చేసి చయ్యన నాపృధాచల ముచేరి| (పంచపాది) తే! గీ|| యచటన్నద్ధగిరీశ్వరు సభినుతించి | వృద్ధబా లాంబలకు దోసి లిచ్చి పిదప | జూరుమణిముక్త యనునది జలక మాడి | రమ్య విభవమ్ముతో శివరాత్రినాఁడు | చేరెఁ బేర్మిదిక్కో వులూరు రాజు|| 39|| వ|| అయ్యెడఁ ద్రివిక్రమస్వామికిని బుంగోమల నాయిక కును వంశనములుపచరించి పిదప నరుణాచల ముం జేరి యరుణాచలస్వామి సోమస్కందమూర్తుల సేవించి తిరువళ్లూరు గారవించి యారం బాక స త్రం బధిష్టించి ఫాల్గునశుద్ధ దశమిదినమునఁ దనరాజధాని యగు వేంకట