పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

శ తా న ధా న సారము , పూర్వార్థ ము ,

(సమస్య) బకము స్వడి మ్రింగుచున్న బల్లిం గనుమా,

క: ప్రకటతరకప్పగంతుల
నుకులోదధిపూర్ణచంద్ర సూరిజనేంద్రా?
సుకరముగ మక్షికాశా
బక మున్ వడి మింగుచున్న బల్లిం గనుమా31

</poem>

(సమస్య) అంధుం డర్థ నిశీధమందు గనె నయ్యర్కేందుబింబములన్,

శా! పుంధర్మేతసరస్వతీ కవులతో భూపాలకుం డాదితే
యాంధస్త్రీక్ష్ణగభస్తీ బింబముల దివ్య ద్వృత్తి వర్ణించి స
ధ్గ్రంథముల్ రచియింపుఁడీ యనినఁ దధ్గ్రంథానుసంధానని
ద్రాధుం డర్థ నిశీధమందుఁ గనె నయ్య ర్కేందు బింబములన్32

</poem>

(అసూయచే సభకురాని కుకవులు)

చ|| తెలుఁగుల నించుకంతఁ గని. తేలిక కబ్బము లల్లునట్టినా
రలు వరసంస్కృతాంధ్ర కవిరాజవిరాజితమై కరంబు పెం
పలరుసభాంగణంబున కహా? పిలువన్ దగ రాఁదలంతురే?
యిల వర బాదమన్వయనదీశ సుధాకర? వేంకటాభిథా,1

క! నీరసపుబకము దగఁ దా
సారస మగునా? కరీంద్రసమతం గనునా!
సైరిభము, కుకవిజనుఁ డిల
సారతరకవీంద్రు డగునె? చర్చింపంగన్ •2

/poem>

క: నాక బలిపళ్లెరముల
నాఁకట జీవించుకుకవు లరుగుదు రె? లస
న్నాక నిలయక విసమకవి
నాకాధిపు లున్న సభ కనాతురు లగుచున్3

</poem>

........................................................................................................

లును. . . . . . . . . . . . . శ్రీ బాదము వెంకటరత్నము గారియింట నొక పరియును ఆష్టావ ధానము చేసియు న్నారు అందలి విశేషములు మఱియొక సారి ముచ్చటింపఁదలఁచి యిటిప్పకీ యుదంతము సాంతంబుచే సెదము, . . . . . . . . . . . . . . . . . . . (ఆనియున్నది.)