పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/14

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


                                (స్త్రీ వర్ణనము) సీసము.
నీరజాతముఁ బోలునెమ్మొగమ్మున మేలుకస్తురినామమ్ము కళలుగులుక
రంగారఁ గట్టిన బంగారు సరిగంచు చీరు పాదములపైఁ జిందులాడ
వలలోఁ బడిన జక్కవలఁబోలి కుచపాళి కంచెల ఖండించు కరణి నిగుడ
నిరువంకఁ గువలయసరము దాపినట్లతినీల నేత్రాంతగతులు సెలఁగ.

తే||గీ|| చెలి యొకతె వచ్చుచున్నది చెలులఁగూడి
        యలరువల్తుని మేల్పూవుట మ్మనంగ
        దానిఁ గూడంగఁ గల్గిన మానవులకుఁ
        వేఱె నాకాబలారతుల్ గోర నేల.
                            (ఇంగ్లీషు విద్య) మత్తేభము
తిరిపెం బెత్తెడివారి నెయ్యది మహాదేవేంద్రులం జేయునో
వరనీచాన్వయజాతు నెయ్యది మహావంశోత్తమున్ జేయునో
ధరణిన్ వైదికునైన నెయ్యది తగన్ దా హూణుఁగాఁ జేయునో
వరశోభాకర మట్టిహూణకల నే వర్ణింపఁగా నేర్తునే.
              (అతిబాల్య స్త్రీ వివాహము) చంపకమాల.
జనములు చిన్నికన్నెలకు సత్వర మొప్పఁగఁ బెండ్లి చేసినన్
ఘనమగు తెల్వి లేకునికిఁ గన్నియ లప్పుడు పెండ్లి యాడి యౌ
వనమున నాత్మకుం దగనివాఁడయినన్ దిగనాడి యాతనిన్
ఘనత దొలంగ జారరతికాంక్ష లొనర్చిన దోస మౌఁజుమీ.
              (దేశాటనము వలని లాభము)
ఆ||వె||దేశచాలనంబు తెల్వి పుట్టఁగఁ జేయుఁ
        గరుణ మనమునందుఁ గలుగఁ జేయు
        నతిధిపూజలందు నాసక్తి పుట్టించు
        ధైర్యమిచ్చు రిక్తదశ నడంచు.


ఇయ్యెడ రాజయోగి యను పత్రిక.

మాకాకినాడపురమ్మున పిఠాపురం రాజాగారి కాలేజిలో ఖర సం|| ఆశ్వయజ నాఁడును మరల నా బ ౧౪ నాఁడును బ్ర|| శ్రీ|| చెళ్లపిళ్ల వెంకటాచలశాస్త్రి.