పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాకినాడ

3


(రామరావణ యుద్ధము) శార్దూలము.

రాముం డప్పుడు బాణసప్త కముచే రక్షోవరున్ గొట్టిన
భీముండై దశకంధరుండు విపులాభీలాతి హేతిచ్ఛటా
థామస్ఫూర్జితవీతి సూత్రుఁ డగుచున్ ధైర్యంబు పెంపారఁగా
భూమా స్త్రమ్ముల రాము నేయ నపు డాపో రయ్యె ఘోరమ్ముగన్7

(ప్రాతఃకాలము) మత్తేభము

..

కమలముల్ వికసింపఁ గోక వితతుల్ కాంతిన్ జెలంగఁ దగన్ విమలాకాశమహాంతరాళమున దీప్తి జ్వాల లింపారఁగా గమలాప్తుం డుదయింపఁ దూర్పుమల పైఁ గాంతిచ్ఛటల్ తారకా సముదాయమ్ములజాఱెదెల్వి గనియెన్ సర్వ ప్రపంచములున్ :8</poem>

(భోగముదాని సిగపూవు) ఉత్పలమాల,

సూనము చూడు మిత్రవర! సూనశరార భుజంగ సంఘస నానిత వారయోషీదసమానన వాంబుద కేశపాశస మ్మానము గాంచి మించెడు ఘుమంఘుమ వాసితభర్మనిరీతా నూనవిభూషణం బయి మహెన్నత భాగ్యదశావరీతమై.9</poem>

(కాకినాడలోని యుదక సదుపాయము)

తే||! బచ్చువం శాఖోసోముండు వరగుణుండు గర్వదూరుండు రామేశఘనుఁడు పేర్మి గచ్చుకుండ్లను గట్టించి కడ పె జలము కాకినాడ పురమునఁ గఱవు దీర. .10</poem>

(సభానాయకుఁడు)

తే|గీ గుణగణాధ్యుండు రసీకుండు గుశలమతియు పండితోత్త మహృత్పద్మ భానుమూర్తి దానకర్ణుండు దుర్జనదానహరుఁడు సభకు నాయకుఁడై యుంట సమ్మతంబు.11</poem></poem>

దివాకర్ల తిరుపతి శాస్త్రులవారివలన విద్వజ్జన మహాజనులసాన్నిధ్యమ్మున శతలేఖినీ క విత్వతంత్రము నడిపింపఁబడినది. ఆసభలు -మ! రా! రా! తో లేటీలక్ష్మీనరసింహము ".... గార్లవలనఁ గూర్పంబడిన వై కాకినాడ జగన్నాథపురములలో నుండు పెక్కండ్రు

.