శ్రీమత్పరదేవతాయైనమః
శతావధానసారము.
తిరుపతివేంకటీయము.
(పూర్వార్థము.)
ఖర సంవత్సర ఆశ్వయుజ బ. 8 శనివారము కాకినాడలో శతావధానమందు రచించిన 103 టికి గొన్ని పద్యములు.
(సంశయించు సభానాయకునింగూర్చి చెప్పినది)
చ|| నిలిచియె వేయి పద్యముల నేర్పలరంగను సంస్కృతాంధ్రభా
షలఁ దగఁ జెప్ప నేర్తు మని చాల బ్రతిజ్ఞ వహించినట్టిమే
మెలమిని నూఱు పద్యముల నిప్పుడు చెప్పుట కెంతగొప్పయౌ?
నిల వరబాదమన్వయపదీశసుధాకర? వేంకటాభిధా.
(శ్రీరామమూర్తి) సీసము.
శ్రీమద్ధరణిజాత సీమంతినీమణీ హానద్విగుణిత ప్రభాబ్జకుండు
నమితనిర్జరసంఘ కమనీయమకుట సంఘటిరత్న ప్రభాకలితవదుఁడు
మహితమసృణ వనమాలాకలితగంధ వాసిత దిక్చక్రవాళకుండు
ఖండితామరశత్రు మండల మణిగదాదండమండిత భుజాదండకుండు
తే||గీ|| భానువంశాబ్ధి సోముండు వరణుండు
నైన శ్రీరామచంద్రుం డనంతకృపను
సకల సవత్సమృద్ధులఁ జక్క నిచ్చి
ధరణి రక్షించు నాచంద్రతారకముగ.1
(విక్టోరియా రాణిగారు) మత్తకోకిల
నీరధారలు లేనిభూముల నీరధారల ముంపుచున్
సారవత్తర మైనధాన్యము చక్కఁ బండఁగఁజేయుచున్
భూరిసౌఖ్యము మానవాళికిన్ఁ బొల్పుమీఱఁగఁ జేయువి
క్టోరియాభిధరాణి నెన్నఁ బటుల్ జగమ్మున లేరుగా.2</poem></poem>