పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ తావదా న సొర ము, ఉత్త రా ర్థము.

127


కం || వరగుంటుపల్లి కులశే | ఖరుడగు గోపాలకృష్ణ కవినగు నే వి |
స్ఫురిత వినతు లోనగూరిచి గురువిజ్ఞాపన 'మొనర్తుఁ గూరిమివినుఁడి |2|

కం| ఇట సౌఖ్య మచటయుష్మ !త్పటువిభవానంద భోగ వైభవములని !
స్ఫుటముగ ప్రాయంగల లొ క్కఁట నా పైఁగలుగు కూర్మిఁగవిపులా రా | 3|
మ|| భవదీ యోజ్జ్వల వాక్చమ త్కృతీరస ప్రాగల్బ్యసందర్భసం
భవశృం గారవిలాస భావక ల నా ప్రాచుర్య నిర్దుష్పమౌ |
శ్రవణానందము నాకునంపుఁడు కళా చంచన్మనీషావి శే!
షవిహార్తులమ రీయ భీస్పిత మొ గిన్సాఫల్యముం జేయుఁడీ

మ|| గురులో శంకరులో విరించనులో నాకు స్థాన రాజన్యులో
|శరసంభూతులోయంచు ధీగజ సులాశ్చర్యంబునొందంగ భా |
స్వర విజ్ఞాన శతావధాన క ల నాచాతుర్యముంజూపిహ
ర్షరసాంభోనిధి దేల్చితీఱుమిమునిచ్చల్నెన్నగాశక్యమే||5||

గీ||అరయ గుంటూరు డిస్ట్రిక్టు నరసారావు పేట తాలూక కొమ్మాల పాటి
పోస్టు చెన్నుపల్యగ్రహార మీస్థితిగ నాకు నుత్తరము బంపు డీరలత్యుత్సుకముగ|| 6

ఇట్లువి ధేయుఁడు,

చెన్నుపల్లి 21-11-07

గుంటుపల్లి గోపాలకృష్ణయ్య,


ఉ||లాలిత శ్రీనివాసుడ విలాసము జూడగ గుర్మతీశ్వరోస్మిలితమైన యుత్సవ ము......................................................................భళితము బోటి మహాకవీంద్రు లిక్కాలము నందు లేవని సగర్వముగన్ వచియింతు నేల్లెడన్ |1|

చ||తిరుపతి వేంకటేశ్వర సుధీమణు లష్టవతావధాన నా ద్గర పరితోషు లీకృతిని సత్య వులద్భుత , మొంద దెల్గుగా | విరచనజేసి శాశ్వతపు విశ్రుతకీర్తి నిగొన్న సత్క వీ శ్వరులనుతింతు సంతతవిశారదులంచుఁ దలంచి నేర్పుగ న్

|ఉ| శ్రీయుత వేఱె శాషథవిశేషమునన్గుణమౌచునుండె నా | 

కాయము, పూర్ణమైన సుముఖత్వము గాంచి భవత్ప్రదర్శన  ! న్యాయము దీర్చుకొందు నిఁక బ్రహ్మకులాం బుధి పూర్ణచంద్ర వి ద్యా యుత సర్వసద్గులుమహాబలధీబల వేంకటేశ్వరా!

నాయని శంభులింగం:

శ్రీరమా భామినీ చిత్రాంబుజోద్భవ బాస్కరపదపద్మ భక్తులార భూవలయస్థిత బుధరాజకవిరాజ వందిత పత్కంజ పంతులార | రతిమనోహర శరీర సమాచుయుత విమల సుకుమార తనువులార | ఆవృత దిక్సమాదవళ క్వాల్యమూడవశంకంధీ మగ్ను లార!

తే! గీ|| మాన సస్మరణ విహత పాపులార | శివదివాకర చెళ్లపిళ్ల వరవంశ ! సాగర మృగాంకులార - నీచమ్ను లార ! వర తీరుపతి వేంకటకవి వర్యులార ||1||

నరవట్టెమునంశ భవుం దరయగ నారాయణ కవి నగు నేమీకున్ గరములు మోడ్చి యు</poem>