పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటి అంకము


న్యాయా:-ఆకుండలొ ఏమిసామానులుండెను?

హెడ్ కా;- కొంచెమా పాక్క్ తుండ్లు ఉండినదండి.

న్యాయా:-ఈపధకము, పైననే అందరికి కనుపడునట్లుండెనా?

హె-కా:- జ్ఞయాపకం పొరాడండి.

న్యాయా:- పోనీ, మొదలు మీరేచూచితిరా? లేక మరెవరైనను చూపించిరా?

హె-కా;-మొదలే, అంద పాపారు, కైలె,ఎత్తినాడు.

న్యాయా:-సరి, ఈపదకము వెనుక "వి" అక్షరమున్నదని వీరణ్ణ శెట్టిగారు వ్రాయించియుండిరా?

హె-కా:-ఇల్లెసార్.

న్యాయా:-అపరాధి ఇల్లు సొదాచేయవలెనని మీకు మొట్టమొదట సలహాచెప్పినదెవరు?

హె-కా;-(కొంచెమాలొచించి) డైరీలోఇంఫర్ మేషన్ వున్నదండి.

న్యాయా:-నీనవశ్యముగచెప్పవలయును. నేను డయిరీను చూచి యున్నాను.

హె-కా;-అందసార్ దానండి 'ఇన్ ఫర్ మేషన్ ' ఇచ్చింది.

న్యాయా:-సరి, దిగండి. సాక్ష్యముముగిసింది. శ్రీధర శాస్త్రి! ఇప్పుడు నీపైనసాక్ష్యము పలుకబడినది విన్నావు. నీచేమిచెప్పుకొంటావు?

శ్రీధర:-స్వామి! నాకీచొరీసమాచారమే తెలియదు. చంద్రహారమును నేను చూడనేలేదు. శెట్టిగారిలెఖ్ఖల పుస్తకములు చేతపట్టడమేగాని వారిపెట్టెలజోలికి నేనెప్పుడు పొవడములేదు. ఈపదకము నాఇంట నెవరుపెట్టిరో నాకుతెలియదు. మాతల్లికి 3 రోజులుగ ఎక్కువగానుండి 13వ తేదీ రాత్రియే చనిపొయింది. తెల్లవారుజాముతరువాత శవసంస్కణకార్యక్రమము నకై చింతించుచుంటిని. చేతకాసైనను వుండలేదు. కాసులులేకశవమును

75