పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ అంకము


హెడ్ కా:--అమా, చేసిండాన్

ప్రా-ఇన్:-మీరేఖుద్దుసోదా చేసితిరా?

హెడ్ కా:-అమాస్దార్! పదునాలాం తారీఖుచేసిందాన్

ప్రా-ఇన్:-పంచాయతీదార్లు ఎదురుగానుండిరా?

హెడ్ కా:-ఆజరువుండిరి.

ప్రా-ఇన్:-వారిలో ఏవరైననుసాక్షిగావచ్చినరా/

హెడ్ కా:-విద్యాలంగారి జొస్యర్ అయ్యర్ వచ్చినారు.

ప్రా-ఇన్:-సోదాలో ఏమైనదొరికినదా?

హెడ్ కా:-ఒర్ పదఘం దొరికింది

ప్రా-ఇన్:-ఇదేనా?

హెడ్ కా:-ఇద్దా సార్

ప్రా-ఇన్:- దీనినెవరైననూ గుర్తుపట్టినారా/

హెడ్ కా:-శెట్టియారు తందిదా అనిచెప్పిందార్

ప్రా-ఇన్:-ఏమి గుర్తులు

హెడ్ కా:-వెనుకప్రక్కా 'ని ' అచ్చరముందాదిసార్.

ప్రా-ఇన్:పంచనామా వ్రాసినారా?

హెడ్ కా:-అంతారూల్సుప్రకారం వ్రాసినారు.

ప్రా-ఇన్:-ఇదేనా పంచనామా?

హెడ్ కా;-ఇదేనండి.

ప్రా-ఇన్:-(కూర్చొనును)

న్యాయా:-(శ్రిధరుని చూచి) మీరేమైనను అడుగుదురా?

శ్రిధర:-నేనేమైనను మీసొదాకు ఆటంకముచేసితినా?

హెడ్ కా;-ఒరుగాలంలేదండి

శ్రిధర:-అంతేనండి

న్యాయా:-పిళ్ళె! ఈపదక మెక్కడ చిక్కినది.

హెడ్ కా:-ఒరుమూలెకు మూణుకుండలు జోడించి యుండించి. అదిలేమొదల్ చట్టిలేదొరికింది.

న్యాయా:-ఆకుండకుమూత ఏమైనయుండెనా?

హెడ్ కా:- ఇల్లె

74