పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ అంకము


మోయుటకు ఒక్కరురాకపోయిరి. శెట్టిగారినైనను అడిగి పైకము తేవలెనని యోచించుచుండగా వకీలు భీమసేనగారి బార్య మాఇంటికివచ్చిరి. వెంటనే ఆచార్యులవారిని వకీలుగారిని చూడవచ్చిరి. వెంటనే పొలీసువారు గూడ వచ్చిరి. ఇల్లంత వెదకిరి. మూలకు చేర్చియున్నదొంతి కుండలలో పదకము దొరికెనని నాకుచూపించిరి. నాదిగాదంటిని. ఇయ్యది నాయింటనెట్లు దొరికెనో సర్వసాక్షియగు భగవంతునకే తెలియును. నాకొక్కటియు దెలియదు.

న్యాయా:-ఇంతేనా/

శ్రీధర:- ఇంతే

న్యాయా:-(ఆలొచనచేయుచు) శ్రీధరశాస్త్రి, నెకెవరైనను ద్వేషులున్నారా?

శ్రీధర:-లేదు.

న్యాయా:-నిశ్చయముగచెప్పుము. నిన్నుచెడుపవలె నని నీపయి పగ ఎవరికైనను గలదా?

శ్రీధర:-(ఇంచుకయోచించి) నాకుతెలియదు

న్యాయా:-నీవు వకీలు బీమసేనరావు కొలువును ఎందులకు వదలితివి? అందేమయినను తప్పు చేసితివా?

శ్రీధర:-లేదు

న్యాయా:-వకీలుగారే నిన్నుకొలువునుంచి తప్పించిరా?

శ్రీధర:-అవును.

న్యాయా:-శాస్త్రి! కారణమని నేనడిగెదను, కాని నీకిష్టమున్న చెప్పవచ్చును. లేకున్న ఊరకుండ వచ్చును.

శ్రీధర:-అయ్యా! కారణము చెప్పుటకు నాకిష్టములేదు.

తార:-(ముందుకివచ్చి) అయ్యా! ఈయపరాధి నాకు తండ్రి సముడు. నను బిడ్డవలె పెంచుచున్నారు. ఇతనితొ మాటాడుటకు నాకు కొంచెమవకాశమిండు.

76