పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఐదవ రంగము

. దానివలె ప్రకృతసమాజపు నియమము! తారా! కాలము మీరుచున్నది. రమ్ము. నేనును, నీవును, శ్రీధరుడును, ముగ్గురమును ఈశవముసు కొనిపోవుదము.

(అనుచు ఆశవము దగ్గరకుపోయి తలవంచికొని ప్రార్థన చేయు కూర్చొనును.)

(ప్రవేశము-భీమ సేన రావు-విద్యాలంకారాచార్యులు)

భీము:- (లీలావతిని చూచి; నిశ్చేష్టితుడై , ఆగ్రహముతో) ఏమి!?

లీలా:- తలయెత్తి చూచి, మెల్లగ లేచి, స్టేజుముందరి భాగమును చేరి, సైగ చేసి, భీమసేనగావును వద్దకుగమ్మని )'

అరవకుము. ఇదివకీళ్ళు వాదించుస్థలము గాదు, సాక్షులనుభయ పెట్టి వంచిచు స్థలముగాదు. సూర్యచంద్రులను, అష్టది క్పాలకులను, తుదకులోక నాధుడగు శ్రీమహావిష్ణువును సయిత ము జయింపచాలితిమని మదముచే విరవీగుచుండు హిరణ్య కశిపు, రావణాది అసుర శ్రేష్ఠుల కైనను గర్వమునడంచి భయ మను పుట్టి చుస్థలము. మృత్యు దేవతయ ధీన ముసుమా ఈస్థల మిప్పుడు. ఇందు మృత్యుంజయు డొక్కడుమాత్రము. తలయెతి తిరుగుటకు అర్హుడుగాని నీయట్టి వాడు తలవంచి దైన్యముతో గద్గద స్వరము తో మాటలాడవలెను. హెచ్చరిక. నన్నా నీవు పిలిచినది.

భీమ:- నిన్నే

లీల:- నే న చేతన పదార్థముగాదు. నాతలితండులు నాకు పేరిడి నారు. నీకు నన్ను పెండ్లి చేసియిచ్చి నను నాశరీరమును చెడుపుటకు సహాయము చేసిరి గాని నా పేరుమాపుటకుగాదు. నీకధికారము లేదు.

భీమ:- (చెవులు మూసికొని.) నారాయణ! నారాయణ!!

విద్యా:- కృష్ణా! వాసు దేవా!! జ్ఞానముండవ లె, జ్ఞానము.

భీమ: - అయ్యయ్యో! దేశ మెంత చెడిపోయెను! ధర్మమున కెట్టి దుస్థితిగలిగెను! ఈ భారతవర్షమున కెట్టికుందకముగలిగెను! ఎట్టి యపకీర్తి గలిగెను హిందూస్త్రీ లకు.

62