పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ యంకము


తార:— అమ్మా! నీ కేల యిట్టిబుద్ధిపు ట్టెను? నీవు సమాజమునకు గొప్పగనున్నావు. నీకుగౌరవముగలదు. వెల లేని పతిభక్తి చే వెలగుచుండు సతీమణివని నిన్ను సకలప్రపంచమును కొనియాడు చున్నది ధర్మపత్నియను బిరుదున కేహానిక లుగునే!

లీల:- ధర్మము లేనిపతి యొక్క సతి, ధర్మపత్ని యెట్లగును? భర్త దగ్గర ధర్మమున్నగదా భార్య ఆధర్మమును పరిపాలింప దొడుగును?

తార:- అమ్మా! దూరమాలోచింపుము. ఊరక ఏలకష్టములకు గురియయ్యెదవు? ఒక నాడు గృహమువిడిచి ఒంటరిగా వీథిని వెళ్లిన దానవుగావు. భర్తను ధిక్కరించిన పిదప నీగతి ఏమగునో ఇంచుక యోచించుము. మగవారి సహాయము లేక మగువలు ఈసంసార సాగరమును తరింపగలరా.

లీల:- తారా! నాకట్టి భయము లేదు. కష్ట మెట్టిదో, దుఃఖము ఎట్టి దో, నిరాధారత్వ మెట్టిదో పరీక్షించియే చూచెదగాక, నిరా ధారత్వమా? ఈ ప్రపంచము , ఆకాశ మధ్యమున పుట్టి చెఁడువ లె తిరుగుచున్న దిసుమా! దీనికి ఆధార మెది? ప్రహ్లాదుడు తండ్రికి ఏమియుత్తరమిచ్చెను. జ్ఞాపకము లేదా?'

తార:— అమ్మా! నీ వెంత చెప్పి నను నామనసునకది యెప్పకున్న ది. సమాజము నీ కొన్ని పేర్లిడునో! ఎందరునిను! వేలు చూపి హసింతురో! యోచించినట్లైల నాకుకళవలము కలుగుచున్నది.

లీల:- తారా! సమాజము సమాజమనుచుంటివి. ఈసమాజపుకట్టు బాట్లను చూచి తప్పకుండ అనుసరించి ఆచరించిన వారికిమాత్ర ము సమాజ మేలాటి సహాయమునొనర్చినది? కష్ట స్థితియందు ఎట్టిసహాయమయినను గలుగునా? ఈ సమాజమునుంచి- “ తెప్ప లుగ చెరువునిండిన గప్పలు పది వేల గదరా సుమతీ” అనివిన లేదా? అంతయే. భాగ్యవంతుల పీనుగను చూచిరా, పరోపకా రబుద్ధి భుజములపై నికే ఎక్కును. నిర్భాగ్యులపీనుగ అయిన చో నా భార్య గర్భిణి. . . . . . తల్లిదండ్రుల - ఆయువు. ..... కోటి శాస్త్రములుకూర్చి తప్పించి కొందురు. ద్రవ్యమునకొక ధర్మ శాస్త్రము. దారిద్ర్యమున కొకధర్మశాస్త్రము. ఇది యేగదా

61