పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ యంకము


విద్యా:- కలియుగము ముదుగుచువచ్చే. సావిత్రి, చంద్రమతి ఇట్టి పతివ్రతా శిరోమణులు సంచరించిన ఈ పుణ్యభూమి.......

ల: - ఆచార్యుల వారూ! మారీచి, సుబాహు, శకుని, ఇట్టిపుణ్య జనులవతరించిన ఈపుణ్య భూమి . . . . . .

విద్యా:— అమ్మా! బుద్దివ చ్చెను. నీతో ఎవరు మాట్లాడువారు? ఆడుది సాహసించెనా మగ వారు, "మే మేమి చేయుదుము. ముఖ్య ము కలియుగము,

లీ:- ఆచార్యుల వారూ! మీయట్టి వారలుండిన నిక్కముగ నియ్యది కలియుగమే. చూడండి. అదియొక్కటేగాదు. ఇది రోకలియుగము, దేవునికై న దెబ్బేగురువు.

భీమ: – మూయుమునోరు! అధిక ప్రసంగివి. భర్తయధికారము నీకు దెలి యునా? (అనిమాట్లాడుచుండగా)

(మధుర పిళె ఒక వైపు ఉంచి వచ్చును. వెంట మరియొక జవాను వచ్చును. విద్యాలం కారాచార్య , భీమ సేసరావు, ఒక్క చోట చేరుదురు. లీలావతి, తార, ఆశ్చర్యమునభినయింతురు.)

శ్రీధర:- (దిగ్గున లేచి) అయ్యా! మీ రేలవ చ్చితిరిందు?

మధుర – డూటి వుండాది సామీ! ఏమి దా చేసేది సెప్పండీ. నౌకరీ చెడ్డది.

శ్రీధర:— అయ్యా! ఏమి? నీమాటలునాకర్షముగాలేదు.

మధుర:- ఇక్' స్పెక్టరుగారు మిమ్ములను స్టేషక్ కిట్టె పుడుచుకొని రమ్మన్నారు. నీ ఇల్లుదా సోదా చేయవలె.

శ్రీధర: - ఎందులకు?

మధుర:- ఏమిసామి! కొంచెముగూడ తెలియనట్లుమాట్లా తారే! శెట్టిగారింట్లో చందహారము ఎక్కడ పెట్టినారో చెప్పండి?

శ్రీధర:—హర! హర!! హర!!! మృత్యు దేవతా! అవమాన దేవతను గూడా వెంట బెట్టుకొనివచ్చియున్నావా? (అనిఇంచుక యోచించి) అయ్యా! సోదా చేయుటకు నాయటంక మేమియును లేదు, అయిన నిది సమయమా?

63