పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఐదవ రంకము


వులను నిరొధింప సాధ్యమా? మీరు తెలిసినవారు. అయ్యో! దు:ఖించుచున్నారే. నాకు చెప్పరాదా? ఎందులకట్లు సంకటపడుచున్నారు. కేవలము నశ్వరమగు తల్లిదేహము క్షీణించేనని మీరు ఇట్లు దు:ఖించుచున్నారా? నేనమ్మను, మీసంకటమునకు మఱియొక కారణమేదియో యుండవలెను. నాకు చెప్పగూడదా?

శ్రీధర:- చచ్చినవారికి కాదమ్మా, బ్రతికినవారి,బ్రతుకు తెరవుకొరకే నెను దు:ఖించుచున్నాను.

తార:-నాకొక్కటియు అర్ధముకాదు. నాకొరకు దు:ఖించుచున్నారా?

శ్రీధర:- బిడ్డా! ఈతల్లి నన్నొకనినేకాదు నిన్నుగూడ తనబిడ్డవలె పొషించుచుండెను. అట్టిప్రేమరాశిని మరల నీకెక్కడనుండి కొనితెత్తునమ్మా, ఇదియే నాదు;ఖకారణము. ముందు నేసేవ ఎవరుసేయుదురు. నీకాన్పునకెవరు సాయపడుదురు? దరిద్రుడనే! ఎవరినికొనితెత్తు? నీకస్టములమఱచి నాకు ముదముగూర్చుమాటలు చెప్పుచున్నావే ? ఏ! నేనెంతనిదు:ఖంతును? ఈశ్వరానుగ్రహమువలన నీకు సుఖప్రసఫమయి నీకు నెమ్మది కలిగినపిచప నీవు నాసేవజేయనొప్పుదువు గాని, ఇప్పుడు నీహితమునకై, నెనేమె చేయజాలుదు?

తారా! ఆలోకరక్షకుడే నిన్ను, నన్ను, సర్వులను రక్షించువాడని నాకు తెలియును. ఆదృఢనమ్మకము నాకుగలదు కాని నీసౌఖ్యము నరయట నాకర్తవ్యముగాదా? ఈచింతమాత్రము నన్ను బాధించుచున్నది. తల్లి మరణమునకు దు:ఖింపను. నీకాన్పుకై దు:ఖింపను. ప్రపంచమున బిడ్డలుకన్నతల్లులు ఎందరొ నిను గాపాడుటకు సిద్ధముగానుందురు. అయిన......

తార:-అయిననేమి? మీచింతకు గారణమేమి?

శ్రిధర:- (లేచి ఇటునటు తిరుగును) లేదు చింత, చింతకు కారణములేదు. అదియుగూడ లోకభర్తకు చెందిన కార్యము. అతడే

50